Preity Zinta: ఆ మాత్రం సాయం చేయలేవా.. సిగ్గుందా.. ఫాన్స్ ఫైర్

ABN , First Publish Date - 2023-04-06T19:03:01+05:30 IST

వికలాంగుడికి చిన్న సాయం చేయలేకపోయావా? రూ.100 కోట్ల ఆస్తి ఉన్న నువ్వు.. కనీసం వంద రూపాయలు సాయం చేయలేవా?

Preity Zinta: ఆ మాత్రం సాయం చేయలేవా.. సిగ్గుందా.. ఫాన్స్ ఫైర్

వికలాంగుడికి చిన్న సాయం చేయలేకపోయావా?

రూ.100 కోట్ల ఆస్తి ఉన్న నువ్వు..

కనీసం వంద రూపాయలు సాయం చేయలేవా?

కొంచెమైనా సిగ్గనిపించడం లేదా?’’ Shame on Preity Zinta


అంటూ బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాను(Priti Zinta) తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. వీల్‌చైర్‌లో కూర్చుని రోడ్డుపై భిక్షాటన చేస్తున్న ఓ వికలాంగుడు ప్రీతి జింటాను చూసి సాయం చేయమని అర్థించాడు. ఆమె ఫ్లైట్‌ టైమ్‌ అవుతోంది అంటూ సారీ చెప్పి కార్‌ ఎక్కి వెళ్లిపోయింది. అతడేమో ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతుందా అన్న ఆశతో హీరోయిన్‌ కారు వైపే వీల్‌చైర్‌ తోసుకుంటూ వెళ్లాడు. ప్లీజ్‌ మేడమ్‌ ప్లీజ్‌ (please madam please) అంటూ ఆర్తిగా అడిగాడు. అయినా ఆమె కనికరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘పాపం అతను ఎంతో ఆశపడ్డాడు సాయం చేస్తావని, నువ్వు ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోయినందుకు అతను ఎంత బాదపడి ఉంటాడో’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. దిల్‌ చేసే సినిమాతో నటిగా కెరీర్‌ ప్రారంభించిన ప్రీతి జింటా ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. మహేశ్‌బాబుతో ‘రాజకుమారుడు’లో నటించింది. (Netizens trollingon prity zinta)

Untitled-1.jpg

Updated Date - 2023-04-06T19:03:38+05:30 IST