Pathaan: షారూఖ్, దీపిక, జాన్ అబ్రహాం రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?
ABN , First Publish Date - 2023-01-25T20:22:00+05:30 IST
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). ఈ సినిమాలో దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. బడా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) తెరకెక్కించాడు.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). ఈ సినిమాలో దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. బడా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ రూ.240కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీ చేసేందుకు గాను షారూఖ్, దీపిక, జాన్ అబ్రహాం కళ్లు చెదిరే రీతిలో పారితోషికాన్ని తీసుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
పఠాన్ సినిమా చేసేందుకు గాను షారూఖ్ ఖాన్ రూ.35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. లాభాల్లోను వాటా ఉందని సమాచారం. దీపికకు పారితోషికంగా దాదాపుగా రూ.10కోట్లు, జాన్ అబ్రహాంకు రూ.15కోట్లు చెల్లించారని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరు సంపాదించుకున్న సిద్దార్థ్ ఆనంద్ రూ.15కోట్లను ఫీజుగా తీసుకున్నాడట. పారితోషికాలను మినహాయించి ‘పఠాన్’ ను రూ.150కోట్ల బడ్జెట్లో పూర్తి చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం రూ.15కోట్లను కేటాయించారట. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లోకి ‘పఠాన్’ ను తాజాగా తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ యూనివర్స్‌లో ‘టైగర్’, ‘వార్’ చిత్రాలు ఉన్నాయి. పఠాన్ సినిమా షోస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ వస్తుంది. ఫలితంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ అర్ధరాత్రి నుంచే స్క్రీనింగ్స్ వేయాలని నిర్ణయించుకుంది.