ParineetiChopra: ఎంపీతో నిశ్చితార్ధం, పరిణితి చోప్రా ఫోటోలు వైరల్

ABN , First Publish Date - 2023-05-14T12:29:55+05:30 IST

అక్క ప్రియాంక చోప్రా ఎలా అయితే ప్రేమ వివాహం చేసుకుందో, చెల్లెలు పరిణితి చోప్రా కూడా ప్రేమ వివాహానికి సమాయత్తం అవుతోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో పది, ఇద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి

ParineetiChopra: ఎంపీతో  నిశ్చితార్ధం, పరిణితి చోప్రా ఫోటోలు వైరల్
Raghav Chadha with Parineeti Chopra

మామూలుగా అయితే సినిమా నటులు, నటీమణులు ఈ వ్యాపారవేత్తనో, లేదా ఇంకో సినిమా స్టార్ నో వివాహం ఆడతారు, రాజకీయ నాయకులతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటం చాలా అరుదు. కానీ బాలీవుడ్ నటీమణి పరిణితి చోప్రా (ParineetiChopra) మాత్రం రాజకీయ నాయకుడు, ఆప్ ఎంపీ (AAP MP) అయిన రాఘవ్ చద్దా (Raghav Chadha) తో ప్రేమలో పడింది. పెళ్లి వరకు ఈ ప్రేమ దారితీసింది. నిన్న సాయంత్రం ఈ ఇద్దరి నిశ్చితార్ధ వేడుకలు ఘనంగా జరిగాయి.

parineethichopra1.jpg

శ‌నివారం మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జ‌రిగిన వీళ్ళ ఫంక్ష‌న్‌కి ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీళ్ళిద్దరూ చాలా రోజులుగా ప్రేమ‌లో వున్నా, అప్పుడప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్ లో, లేదా ఇంకో దగ్గర కనిపించడమే కాలనీ బహిరంగంగా ఎప్పుడూ వీళ్ళ ప్రేమ గురించి చెప్పలేదు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో మాత్రం ఉన్నార‌ని, పెళ్లి కూడా చేసుకుంటారని నెట్టింట తెగ వార్త‌లు వైరల్ అయ్యాయి.

parineethichopra2.jpg

అయినా అటు రాఘ‌వ్ చ‌ద్దా కానీ, #ParineetiChopraEngagement ఇటు ప‌రిణీతి చోప్రా కానీ ఈ విషయాన్నీ #ParineetiChopra ఎక్క‌డా అధికారికంగా ధ్రువీకరించలేదు. శ‌నివారం నిశ్చితార్ధం అయినా తరువాత, #RaghavChadha తన కాబోయే భర్త రాఘ‌వ్ చ‌ద్దాతో క‌లిసి ఉన్న ఫొటోలను ప‌రిణీతి చోప్రా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోతో పాటు ‘నేను ప్రార్థించింతా.. అవునని చెప్పాను’ అంటూ క్యాప్షన్‌ను కూడా పెట్టింది.

priyankachopra.jpg

ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ వైరల్ అయ్యాయి. ఎక్కడా చూసిన వీళ్లిద్దరి ఫోటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. వీళ్లిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందన్న విషయం కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇద్దరూ ఒకదగ్గరే అంటే లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో (LondonSchoolOfEconocmis) క‌లిసి చ‌దువుకున్నారు. అలా ఇద్దరికీ పరిచయం వున్న స్నేహితుల ద్వారా వీళ్ళిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరిగింద‌ని, అది కాస్త ప్రేమ‌గా మారి, చివరికి ఓ ఇంటివారు అవ్వబోతున్నారు. ఈ నిశ్చితార్ధ ఫంక్షన్ కి పరిణీతి చోప్రా సిస్టర్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాజరు అయింది.

Updated Date - 2023-05-14T12:29:55+05:30 IST