Payal Ghosh: బాలీవుడ్‌పై ‘ఊసరవెల్లి’ నటి సంచలన వ్యాఖ్యలు.. మీ రక్తాన్ని వేరే వారికి ఆహారంగా పెడతారంటూ..

ABN , First Publish Date - 2023-04-09T16:07:09+05:30 IST

పాయల్ ఘోష్ (Payal Ghosh) అంటే ఎక్కువ ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ నటి తెలుగులో రెండో, మూడో సినిమాలు మాత్రమే చేసింది.

Payal Ghosh: బాలీవుడ్‌పై ‘ఊసరవెల్లి’ నటి సంచలన వ్యాఖ్యలు.. మీ రక్తాన్ని వేరే వారికి ఆహారంగా పెడతారంటూ..
Payal Ghosh

పాయల్ ఘోష్ (Payal Ghosh) అంటే ఎక్కువ ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ నటి తెలుగులో రెండో, మూడో సినిమాలు మాత్రమే చేసింది. కానీ.. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ (Prayanam)లో హీరోయిన్‌ అని, అలాగే ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ తమన్నాకి స్నేహితురాలు అంటే మాత్రం టక్కుడ గుర్తు పట్టేస్తారు. అనంతరం ఈ భామకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అలాగే, అనంతరం బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా సరైన అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలోనే ఈ భామకి ‘రెడ్’ అనే చిత్రంలో అవకాశం దక్కింది. బాలీవుడ్ కమెడియన్ కృష్ణ అభిషేక్ ప్రధాన పాత్రలో పొషిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

Payal.jpg

అయితే.. గత కొంతకాలంగా ఈ బ్యూటీ తనకి సంబంధించిన రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. అంతేకాకుండా.. ఆయనపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేసింది. ‘రెడ్’ మూవీ ప్రమోషన్స్‌లో తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ఘాటుగా విమర్శలు చేసింది. (Payal Ghosh about Bollywood corrupt)

Also Read: Preity Zinta: అతనే నన్ను వేధించాడు.. ఇలా జరిగితే మిస్ కాల్ ఇవ్వమంటూ..

Payal-1.jpg

పాయల్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో ప్రజలు మిమ్మల్ని చంపిన తర్వాత మీ రక్తాన్ని ఇతరులకు ఆహారంగా ఇస్తారు. పాతకాలంలో కొందరు మనుషులను చంపి ఇతరులకు ఆహారంగా చేసేవారు. బాలీవుడ్‌లోనూ అదే చేస్తారు. అది చూసి చాలా బాధేసింది. కానీ.. ఆ వ్యక్తులు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుండడం చూస్తుంటే.. నాకు కోపం వస్తుంటుంది. నిజానికి వారు చాలా చెడ్డవారు. అలాగే బాలీవుడ్‌లో 60 శాతం వరకు చాలా దారుణమైన వ్యక్తులు’ అని చెప్పుకొచ్చింది.

కాగా.. ‘రెడ్’ మూవీలో పాయల్ ఎస్కార్ట్ పాత్రలో నటించింది. ఓ కాలేజీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది.. ఆ తర్వాత ఎస్కార్ట్‌గా మారుతుంది. ఈ తరుణంలో ఆమె ఎదురైన పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు. శక్తి కపూర్ ఓ కీలక పాత్రలో నటించిన.. ఈ మూవీని థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి:

Sitara Ghattamaneni: ఎవరైనా నిన్ను ఫాలో అయితే పరిస్థితి ఏంటి?.. మహేశ్‌ కుమారైపై నెటిజన్ల విమర్శలు

Adipurush: మరో వివాదంలో ప్రభాస్ మూవీ.. తన ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారంటూ..

Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

Updated Date - 2023-04-09T16:07:10+05:30 IST