Jawan : తగ్గించడానికే నెగటివ్‌ పబ్లిసిటీ.. నయన్‌ మాత్రం స్ట్రాంగ్‌!

ABN , First Publish Date - 2023-09-21T12:37:28+05:30 IST

జవాన్‌’ (Jawan) సినిమా పట్ల లేడీ సూపర్‌స్టార్‌ నయనతార అసంతృప్తిగా ఉందని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా నయన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Jawan : తగ్గించడానికే నెగటివ్‌ పబ్లిసిటీ.. నయన్‌ మాత్రం స్ట్రాంగ్‌!

జవాన్‌’ (Jawan) సినిమా పట్ల లేడీ సూపర్‌స్టార్‌ నయనతార అసంతృప్తిగా ఉందని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా నయన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘జవాన్‌ సినిమా విషయంలో నయనతార అప్సెట్‌గా ఉందని, ఆమె పాత్రను కట్‌ చేసేశారని దీపికా పడుకోన్‌ని (Deepika padukone) హైలైట్‌ చేసి ఆమెను ఎలివేట్‌ చేశారని దాంతో నయనతార హర్ట్‌ అయిందని బాలీవుడ్‌ మీడియా కథనాలు రాసింది. అయితే దీపికాకు ఎక్కువ పేరు, క్రెడిట్స్‌ ఇవ్వడానికి బాలీవుడ్‌ మీడియా చేస్తున్న పని ఇదని కూడా వినిపిస్తున్నాయి. సినిమాలో నయన్‌ (Nayanathara) క్యారెక్టర్‌కు న్యాయం చేసిన తీరు చూసి దక్షిణాది ప్రేక్షకులే కాదు... ఉత్తరాది వారూ ఫిదా అయ్యారు. దర్శకుడు అట్లీ ఆ క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్‌ చేశాడు. దర్శకుడు అట్లీ మాస్‌ ఆడియన్స్‌కు ఈ చిత్రంతో ఫుల్‌ మీల్స్‌ పెట్టేలా తెరకెక్కించాడు. జవాన్‌ చూసిన వాళ్లకి ఇది పక్కా సౌత్‌ సినిమా అనిపించకపోదు. నార్త్‌లోనే కాదు సౌత్‌లో కూడా జవాన్‌ సినిమా సెన్సేషనల్‌ కలెక్షన్స్‌ని రాబడుతోంది. ఈ చిత్రం సౌత్‌లో సూపర్‌ హిట్‌ అవ్వడానికి కారణం అట్లీ, నయనతార, విజయ్‌ సేతుపతికి ఉన్న స్టార్‌ డమ్‌ కూడా. ఈ ముగ్గరు జవాన్‌ సినిమా సౌత్‌ కలెక్షన్స్‌ని చాలా హెల్ప్‌ అయ్యారు. అందుకే ఆడియన్స్‌ నయన్‌ క్యారెక్టర్‌తోపాటు వీరి గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. ‘జవాన్‌’ సినిమా కలెక్షన్లు, సినిమా సక్సెస్‌ గురించి సోషల్‌ మీడియాలో ఎవరు ప్రశంసించినా వాటిని స్ర్కీన్‌షాట్స్‌ తీసి నయన్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. ‘జవాన్‌’ సినిమా సక్సస్‌ని నయనతార ఎంజాయ్‌ చేస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ బాలీవుడ్‌ మీడియా మాత్రం సౌత్‌ హీరోయిన్‌పై నెగటివ్‌ పబ్లిసిటీ చేస్తుందనే బాధను నెటిజన్లు, నయన్‌ ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

Deepika.jpg

ఈ ఏడాది ప్రారంభంలో ‘పఠాన్‌’ చిత్రంతో వెయ్యికోఓట్లు వసూళ్లు రాబట్టి షారుక్‌.. ఇప్పుడు ‘జవాన్‌’తో ఆ రికార్డును తిరగరాయాలని చూస్తున్నారు. ఇప్పటికే రూ.930 కోట్ల గ్రాస్‌ ని రాబట్టిన ఈ చిత్రం ఈ వారాంతానికి 1000 కోట్ల మార్క్‌ని రీచ్‌ అయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-21T12:47:39+05:30 IST