Neena Gupta: ‘గర్భంతో ఉన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాడు’.. దర్శకుడి గురించి సంచలన విషయాలు తెలిపిన నటి

ABN , First Publish Date - 2023-03-10T12:17:33+05:30 IST

ప్రముఖ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిష్ (Satish Kaushik) హఠాన్మరణం బాలీవుడ్‌ని విషాదంలోకి నెట్టింది.

Neena Gupta: ‘గర్భంతో ఉన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాడు’.. దర్శకుడి గురించి సంచలన విషయాలు తెలిపిన నటి

ప్రముఖ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిష్ (Satish Kaushik) హఠాన్మరణంతో బాలీవుడ్‌ని విషాదంలోకి నెట్టింది. 66 ఏళ్ల వయస్సులో మార్చి 9న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు సతీష్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా (Neena Gupta) ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేశారు.

అందులో.. ‘ఉదయమే ఓ బాధాకరమైన వార్త వింటూ నిద్రలేచాను. ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే. నేను కూడా ఆయనని కౌశికన్‌ అని పిలుస్తాను. మా స్నేహం ఇప్పటిది కాదు. కాలేజీ రోజుల నుంచి మా మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ ఆయన ఇక లేరు. ఇది నన్నెంతో భయానికి, బాధకి గురి చేస్తోంది. తన కూతురు వంశిక, భార్య శశికి ఇది కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు. (Satish Kaushik)

neena1.jpg

అయితే.. గతంలో సతీశ్ తనని పెళ్లి చేసుకోడానికి సిద్ధమైన విషయాన్ని నీనా తన ఆత్మ కథలో ‘సచ్ కహో తో’లో రాసుకొచ్చింది. ఆ సమయంలో నీనా గర్భంతో ఉందంట. ఆ సమయంలో.. ‘పుట్టబోయే బేబీ ఛామనచాయగా ఉంటే.. నా బిడ్డే అని చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఎవరూ నిన్ను అనుమానించరు’ అని సతీశ్ చెప్పినట్లు ఆ బుక్‌లో రాసుకొచ్చింది. (Satish Kaushik)

ఇవి కూడా చదవండి:

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Updated Date - 2023-03-10T12:24:28+05:30 IST