Neena Gupta: శృంగారం గురించి తెలుసుకోవాలి!
ABN , First Publish Date - 2023-06-23T13:35:19+05:30 IST
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ‘లస్ట్ స్టోరీస్2’ (Lust Stories 2) సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆమె గ్రాండ్ మదర్‌గా నటించారు. కాజోల్, మృణాల్ ఠాకూర్(mrunal thakur), తమన్నా(tamannah), విజయ్ వర్మ (Vijay Varma) కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది.
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ‘లస్ట్ స్టోరీస్2’ (Lust Stories 2) సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆమె గ్రాండ్ మదర్‌గా నటించారు. కాజోల్, మృణాల్ ఠాకూర్(mrunal thakur), తమన్నా(tamannah), విజయ్ వర్మ (Vijay Varma) కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్ డైలాగ్‌లు ఉన్నాయి. ఈ విషయంపై నీనా గుప్తా మాట్లాడారు.
‘‘శృంగారం (Sex education) గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం వస్తుందని నమ్మేదాన్ని. ఎందుకంటే మా అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. నేను కాలేజీలో చదువుతున్న సమయంలో స్నేహితులతో కలిసి సినిమాకు కూడా వెళ్లనిచ్చేది కాదు. ఇలాంటి విషయాల గురించి అవగాహన లేమితో బయట ఎవరో మాట్లాడుకుంటుంటే విని అలా అనుకునేదాన్ని. నాకు పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా.. నా తల్లిదండ్రులు ప్రత్యేక బెడ్‌రూమ్‌లో పడుకోలేదు. మేమంతా ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు కింద పడుకునేవాళ్లం. కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకునేదాన్ని. ఆ వయసులో మాకు శృంగారం అంటే ఏంటో తెలీదు. ఒక వయసు వచ్చాక కూడా అమ్మ అలా ఏమీ చెప్పలేదు. పీరియడ్స్ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు తమ బిడ్డలతో చెప్పడానికి భయపడేవారు. పూర్వకాలంలో పెళ్లికి ముందే శృంగారం గురించి అమ్మాయికి కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఏం జరుగుతుందో, ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో అవగాహన కోసం చెప్పేవారు. శృంగారం విషయంలో కొత్త జంట మధ్య గొడవలు రాకూడదని, కలవాలనే కోరికను అబ్బాయి భార్య ముందు ఉంచినప్పుడు అమ్మాయి ఎలా ఉండాలో అప్పటి తల్లులు, లేదా పెద్దలు చెబుతుండేవారు. ఇప్పటి జనరేషన్‌కి అయితే ఒకరు చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల పాత పద్దతి నడుస్తోంది. ఇలాంటి విషయాలకు ‘లస్ట్ స్టోరీస్- 2’ అవసరం ఉంటుంది. ఈ సిరీస్‌లో శృంగార సన్నివేశాలుంటాయి. మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా చెబుతున్నాం. అందులో తప్పేముంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నా’’ అని నీనా గుప్తా అన్నారు.