Animal: రణబీర్ కపూర్ సినిమా నుండి 27 నిముషాల అడల్ట్ సన్నివేశాలని తొలగించారు

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:44 PM

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్' సినిమా నుండి 27 నిముషాల అడల్ట్ సన్నివేశాలని, హింసాత్మక సన్నివేశాలని తీసేసి విడుదల చేశారు. ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు అంటే...

Animal: రణబీర్ కపూర్ సినిమా నుండి 27 నిముషాల అడల్ట్ సన్నివేశాలని తొలగించారు
Ranbir Kapoor from Animal film

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ వంగ రెడ్డి దర్శకుడిగా వచ్చిన 'యానిమల్' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో చిన్న పాత్రలో నటించిన త్రిప్తి డుమ్రి కూడా ఈ సినిమా విడుదలయ్యాక ఇంకో 'నేషనల్ క్రష్'గా పాపులర్ అయిపోయిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఈ సినిమా సుమారు 3 గంటల 23 నిముషాలు నిడివి ఉంటుంది. ఇందులో చాలా అడల్ట్ సన్నివేశాలతో పాటు సినిమాలో హింస కూడా చాలా ఎక్కువ ఉందని విమర్శలు వచ్చాయి.

TriptiDimrinewsabouther.jpg

ఇన్ని విమర్శలు వచ్చినా, ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా ఇంతవరకు రూ.800 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా బాంగ్లాదేశ్ లో కూడా విడుదలైంది. అయితే అక్కడ ఒక వారం ఆలస్యంగా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 1 న విడుదలైతే, బాంగ్లాదేశ్ లో డిసెంబర్ 7న విడుదలైంది అని తెలుస్తోంది.

ranbirrashmika.jpg

అయితే బాంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు మాత్రం ఈ సినిమాపై చాలా కఠినంగా వ్యవహరించింది అని తెలుస్తోంది. సుమారు 27 నిముషాల పాటు అడల్ట్ సన్నివేశాలని, హింసాత్మక సన్నివేశాలని తీసేయాలని సూచించింది. అవన్నీ తీసేసిన తరువాత ఈ సినిమా 2 గంటల 56 నిముషాల వచ్చిందని తెలుస్తోంది. అయితే అక్కడ ప్రేక్షకులు ఇలా 27 నిముషాలు ఈ సినిమా నుంచి తీసెయ్యడంతో అంత సంతోషంగా లేరని బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి. అయితే ఇండియాలో అందరూ విమర్శిస్తూనే ఈ సినిమా కి బ్రహ్మరధం పట్టారు.

Updated Date - Dec 26 , 2023 | 02:44 PM