Malaika Arora: మాజీ భర్తతో డిన్నర్.. వైరల్‌గా మారిన పిక్స్..
ABN , First Publish Date - 2023-01-04T18:28:42+05:30 IST
బాలీవుడ్ భామ మలైకా అరోరా (Malaika Arora), అర్భాజ్ ఖాన్ (Arbaaz Khan) కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట 1998 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం బిన్నాభిప్రాయాలు, విభేదాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు.
బాలీవుడ్ భామ మలైకా అరోరా (Malaika Arora), అర్భాజ్ ఖాన్ (Arbaaz Khan) కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట 1998 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం బిన్నాభిప్రాయాలు, విభేదాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. తమ 18ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. మలైకా, అర్భాజ్ విడిపోయినప్పటికీ స్నేహితులుగా కొనసాగుతున్నారు. తమ కుమారుడు అర్హాన్ ఖాన్ (Arhaan Khan) బాధ్యతలను ఇద్దరు పంచుకుంటున్నారు.
మలైకా, అర్భాజ్ ముంబైలోని రెస్టారెంట్‌లో తాజాగా డిన్నర్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్స్ అందరు ఈ పిక్స్ కింద కామెంట్స్ వర్షం కురిపించారు. ఈ జంట అభిమానులందరు ఆ పిక్స్‌ను షేర్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ఇద్దరు సీరియస్ గా కనిపిస్తున్నారు’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘కుమారుడి భవిష్యత్తు కోసం సమావేశమయ్యారు’’ అని మరో నెటిజన్ చెప్పారు. తమ కుమారుడు అర్హన్‌ను రిసీవ్ చేసుకోవడానికీ గతేడాది ముంబై ఎయిర్‌పోర్టులో మొదటిసారిగా వీరిద్దరు కనిపించారు. అనంతరం మళ్లీ ఎప్పుడు కనిపించలేదు. విడాకులు తీసుకున్నాక మలైకా, అర్భాజ్ ఎవరి దారిని వారు చూసుకున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. కొత్త సంవత్సర వేడుకలను కూడా అతడితో కలిసే సెలబ్రేట్ చేసుకుంది.