Tamannaah - Lust Stories 2: శ్రుతిమించిన తమన్నా.. ఓ ఆట ఆడుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-07-01T11:07:58+05:30 IST

మిల్కీబ్యూటీ తమన్నా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మొదలు ఆమెకు నటిగా నిలబెట్టిన పాత్రలు. తెలుగు ప్రేక్షకులు గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌గా భావించిన క్యారెక్టర్లు. అంతే కాదు తమన్నా పేరు చెబితే గుర్తొచ్చే పాత్రలివి. అయితే తాజాగా తమన్నా చేసిన ఓ పాత్ర తన కెరీర్‌ గ్రాప్‌ మొత్తాన్ని పాడు చేసేలా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌2’. ఈ టైటిల్‌ బయటకు వచ్చినప్పటి నుంచి సిరీస్‌పై నెగటివ్‌ ప్రచారం జరుగుతోంది.

Tamannaah - Lust Stories 2: శ్రుతిమించిన తమన్నా.. ఓ ఆట ఆడుకుంటున్నారు

హ్యాపీడేస్‌.. మధు,

100 పర్సెంట్‌ లవ్‌.. మహాలక్ష్మీ

బద్రీనాధ్‌ అలక్‌నంద

ఊసరవెల్లి.. నీహారిక

బాహుబలి... అవంతిక

సీటీమార్‌.. జ్వాలారెడ్డి

ఊపిరి.. కీర్తి

ఎఫ్‌2.. హారికా

సైరా.. లక్ష్మీ

మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మొదలు ఆమెకు నటిగా నిలబెట్టిన పాత్రలు. తెలుగు ప్రేక్షకులు గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌గా భావించిన క్యారెక్టర్లు. అంతే కాదు తమన్నా పేరు చెబితే గుర్తొచ్చే పాత్రలివి. (Lust Stories 2)

అయితే తాజాగా తమన్నా చేసిన ఓ పాత్ర తన కెరీర్‌ గ్రాప్‌ మొత్తాన్ని పాడు చేసేలా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌2’. ఈ టైటిల్‌ బయటకు వచ్చినప్పటి నుంచి సిరీస్‌పై నెగటివ్‌ ప్రచారం జరుగుతోంది. ట్రైలర్‌లో తమన్నా హాట్‌ (Tamannaah Bold scenes) సన్నివేశాలతో ఆ ప్రచారం మరింత నెగిటివిటీని తీసుకొచ్చింది. ఇందులో తమన్నా కనిపించిన సెగ్మెంట్‌ ‘సెక్స్‌ విత్‌ ఎక్స్‌’ (Sex with Ex) సుజాయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా ‘ఈ అంథాలజీ స్ర్టీమింగ్‌ అయింది.

విజయ్‌ చౌహాన్‌ (విజయ్‌ వర్మ)కు అమ్మాయిల పిచ్చి. అనిత (ముక్తి మోహన్‌)ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. ఒక రోజు కారులో ప్రయాణం చేస్తున్న విజయ్‌ తన ప్రియురాలు (జెన్నీఫర్‌)తో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా కారు చెట్టును ఢీ కొడుతుంది. దీంతో కారును అక్కడే వదిలేసి మెకానిక్‌ కోసం పక్కనే ఉన్న ఊళ్లోకి వెళ్తాడు. అక్కడే అతడికి తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. అప్పుడు విజయ్‌ ఏం చేశాడు? ఇంతకీ శాంతితో ఎలా విడిపోయాడు? అన్నది ఈ సెగ్మెంట్‌ ఇతివృత్తం.

Untitled-2.jpg

ఇందులో తమన్నా శాంతి అనే యువతిగా నటించింది. విజయ్‌ వర్మ తనకు ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌. అనుకోకుండా ఓ చోట కలిసిన వీరిద్దరూ ఓ ఎమోషనల్‌ మూమెంట్‌లో శారీరకంగా కలవడానికి విజయ్‌ ప్రేరేపిస్తాడు. తమన్నా వద్దు.. పద్దతి కాదు నీకు భార్య ఉంది.. నాకు భర్త ఉన్నాడు అంటూనే కమిట్‌ అయిపోతుంది. ఆ నాలుగు నిమిషాల సన్నివేశమే ఇప్పుడు తమన్నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది. సెగ్మెంట్‌ వీక్షించిన వారంతా తమన్నాను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. కొన్నేళ క్రితం ముద్దు సన్నివేశాలకు నో అని స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తమన్నా ఈ సిరీస్‌ కోసం ఆ రూల్‌ను బ్రేక్‌ చేసింది. డీప్‌ లిప్‌కిస్‌కు సై అంది. అంతే కాదు.. శృంగార సన్నివేశాలకు అంతకుమించి అని చేసింది. నటిగా 18 ఏళ్ల కెరీర్‌లో హద్దుదాటి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఈ సన్నివేశాలు కుర్రకారులో హీట్‌ పెంచుతున్నాయి. మరోవైపు ఆ సన్నివేశాల్లో తమన్నాను చూసినవారంతా విమర్శలు చేస్తున్నారు.


‘‘మేం చూసిన మధు, మహాలక్ష్మీ, నీహారిక, అవంతికేనా ఇలా చేసింది. నమ్మశక్యంగా లేదు.
ఊహించని ట్విట్‌ ఇది. ‘ఏంటి తమన్నా.. ఇలా చేశావ్‌.. ఇంత దిగజారి యాక్ట్‌ చేయాలా?’’ అని ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

123.jpg

కొందరైతే తమన్నా నటించిన బోల్డ్‌ సీన్స్‌ను క్లిప్స్‌గా చేసి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. మరో నెటిజన్‌ తమన్నా నటించిన శృంగారా సన్నివేశాలను సమయంతో సహా.. ఈ మినిట్‌ దగ్గర తమన్నాను చూడండి’ అంటూ స్ర్కీన్‌ షాట్‌లు పోస్ట్‌ చేశాడు. మరో నెటిజన్‌ అయితే.. ‘తమన్నా నటిగా నువ్వు చేసిన సినిమాలేంటి? ఈ వెబ్‌ సిరీస్‌ ఏంటి? మతి ఉండే చేశావా? అని మండిపడ్డాడు. ‘ప్రియుడే కదా అని విజయ్‌తో రెచ్చిపోయి నటించావా? అంటూ వల్గర్‌ లాంగ్వేజ్‌లో తమన్నాను తిట్టిపోస్తున్నారు. అయితే తమన్నా మాత్రం దీనిని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. సన్నివేశం డిమాండ్‌ చేస్తే ఆర్టిస్ట్‌ ఇలాంటివి ఆలోచించకూడదు. అయినా మనం ఏ రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా బెడ్‌ సన్నివేశాల గురించి మాట్లాడడం ఏంటి? ఈ సమాజం ఎక్కడుంది’’ అంటూ చేసిన పనిని సమర్ధించుకుంటుంది. ఈ సిరీస్‌కు ముందు వచ్చిన ‘జీ కర్దా’లో కూడా తమన్నా ఇలాంటి క్యారెక్టర్‌లో నటించింది.

ఇలాంటి విమర్శలే తమన్నా ‘జయ లవకుశ’ చిత్రంలో స్వింగ్‌ జరా’ సాంగ్‌ చేసినప్పుడు వచ్చాయి. ఈ పాటలో కూడా అంతే.. తమన్నా డాన్స్‌ మూమెంట్స్‌.. ఎక్స్‌ప్రెషన్స్‌ టూ మచ్‌గా ఉండడంతో తమన్నాను ఓ ఆట ఆడుకున్నారు నెటిజన్లు. అప్పట్లో ఆ పాటకు రూ.80లక్షలు పారితోషికం తీసుకుందని టాక్‌. మరి ‘లస్ట్‌ స్టోరీస్‌2’లో ఇంత బోల్డ్‌నెస్‌కి ఎంత ఛార్జ్‌ చేసిందో మరి.

ఇలాంటి విమర్శలే  ‘సీతారామం’ ఫేం మృణాల్‌ ఠాకూర్‌ మీద వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను సీతగా అలరించిన ఆమె ఈ సిరీస్‌లో ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ ఈదర్‌’ సెగ్మెంట్‌లో కనిపించింది. హద్దులు దాటి శృంగార సన్నివేశాల్లో కనిపించడంతో ‘మా సీతేనా’ ఇలా చేసింది అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 

Updated Date - 2023-07-01T11:24:48+05:30 IST