#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్‌స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

ABN , First Publish Date - 2023-02-22T15:23:46+05:30 IST

పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది.

#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్‌స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ (Kiara Advani) కొన్ని రోజుల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు ఇలా చేసుకున్న చాలామంది బాలీవుడ్ జంటలు అయిన దీపికా రణవీర్ (#DeepikaRanveer), అలియా రణబీర్ (#ranabiralia), వికీ కౌశల్ కత్రినా (#VickyKatrina), ఇలా మరికొంత మంది తో ఈ సిద్ కియారా జంట కూడా కలిసింది. వీళ్లందరినీ బాలీవుడ్ లో ఒక ప్రతేయకమయిన జంటలుగా పిలుస్తూ వుంటారు. వీరి వివాహం రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అట్టహాసంగా రంగరంగ వైభోగంగా జరిగింది. (#SidKiara)

sidkiara.jpg

బాలీవుడ్ నుండి అనేకమంది నటీనటులు, ఇంకా ఇతర సెలెబ్రిటీలు చాలామంది ఈ యువజంట పెళ్ళికి హాజరయ్యారు. అయితే ఈ జంట పెళ్లి అయినా తరువాత హానీమూన్ కి వెళ్లి ఈమధ్యనే ముంబై చేరుకున్నారు. పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది. అది కూడా హిందీ సినిమాల్లో శోభనం పాటల్లో లాగా కియారా ఆ విషయాన్ని షేర్ చేసింది. "ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్ (sic)" అని ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.

sidkiara2.jpg

ఆలా రాత్రి గురించి ఒక పోస్ట్ పెట్టడమే కాకుండా తాను, సిద్ధార్థ్ (#SiddharthMalhotra) కలిసి వున్న ఫోటో ని కూడా షేర్ చేసింది. ఆమె పోస్ట్ కి ఆమె అభిమానులు చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు కానీ అందరూ ఆమె సంతోషంగా ఉంటే చాలు అన్నట్టుగానే పెట్టారు. హానీమూన్ కి వెళ్లే ముందు ఈ కొత్తగా పెళ్లయిన జంట ఢిల్లీ లో తమ స్నేహితులకి, మిగతా వాళ్లకి రిసెప్షన్ కూడా ఇచ్చారు.

Updated Date - 2023-02-22T15:23:47+05:30 IST