Katrina kaif : లేడీ స్పై ఆఫీసర్‌ జోయా.. మామూలుగా ఉండదు!

ABN , First Publish Date - 2023-10-10T20:23:26+05:30 IST

"నేను యాక్షన్‌ సినిమాలకు అభిమానిని. అలాంటి నేను యాక్షన్‌ సన్నివేశాల్లో నటించటం ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. జోయా పాత్ర పోషించడంతో నా కల నెరవేరినట్లయింది’’ అని కత్రినా కైఫ్‌ (Katrina kaif) అన్నారు.

Katrina kaif : లేడీ స్పై ఆఫీసర్‌ జోయా.. మామూలుగా ఉండదు!

"నేను యాక్షన్‌ సినిమాలకు అభిమానిని. అలాంటి నేను యాక్షన్‌ సన్నివేశాల్లో నటించటం ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. జోయా పాత్ర పోషించడంతో నా కల నెరవేరినట్లయింది’’ అని కత్రినా కైఫ్‌ (Katrina kaif) అన్నారు. సల్మాన్ ఖాన్  నటించిన "టైగర్‌’ చిత్రానికి ఫ్రాంచైజ్‌గా వస్తున్న చిత్రం 'టైగర్‌-3’. (Tiger 3) కత్రినా కైఫ్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ పోషించిన టైగర్‌ పాత్రకు ధీటుగా ఉండే జోయా పాత్ర ఉంటందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమా గురించి యశరాజ్‌ ఫిల్మ్స్‌ మేకర్స్‌ మాట్లాడుతూ"టైగర్‌ ఫ్రాంచైజీలో జోయా పాత్రను కత్రినా కైఫ్‌ తప్ప మరొకరు చేయలేరు’’ ని చెబుతూ ఈ చిత్రంలోని జోయా పాత్రధారి కత్రినా పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ ‘‘వైఆర్‌ఎఫ్‌ సంస్థ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై పాత్ర జోయా. ఆ పాత్రను నేను పోషించటం ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. భయానికి లోను కాకుండా ధైౖర్యంగా ముందుకు సాగిపోయే జోయా క్యారెక్టర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాత్ర సహృదయం కలది. తనవారిని రక్షించుకుంటూనే విధేయత చూపగల మనస్తత్వం ఆమె సొంతం. అవసరం ఉన్న ప్రతీ చోట ప్రత్యక్షం కావటంతో పాటు అక్కడ మానవత్వాన్ని చూపుతుంటుంది. జోయా పాత్రను పోషించటం సవాల్‌గా అనిపించింది. ప్రతి సినిమా నాకొక పరీక్షగానే భావిస్తాను. అందులో ఈ టైగర్‌ 3 సినిమా కూడా ఉంది. ఈ సారి టైగర్‌ 3లో యాక్షన్‌ సన్నివేశాలు నెక్ట్స్‌ లెవల్లో ఉండాలని ముందుగానే భావించాం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో శారీరకంగా ఎక్కువ కష్టపడింది ఈ సినిమాకే. యాక్షన్‌ సన్నివేశాలు గొప్పగా ఉండాలని నా శాయశక్తులా కష్టపడ్డాను. నా పాత్ర ధైర్యంతో, సవాళ్లను ఎదుర్కొనేలా, బలంగా ముందుకు సాగేలా ఉంటుంది. ఈ జోయా పాత్రను స్క్రీన్ పై చూసేటప్పుడు ఆడియెన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-10-10T20:23:26+05:30 IST