Kangana Ranaut - Elon Musk: నీ లైఫ్‌లో నాకంటే ఎక్కువ డ్రామా ఉంది.. ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2023-03-20T12:26:14+05:30 IST

బాలీవుడ్‌లో నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే.

Kangana Ranaut - Elon Musk: నీ లైఫ్‌లో నాకంటే ఎక్కువ డ్రామా ఉంది.. ట్వీట్ వైరల్
Kangana Ranaut

బాలీవుడ్‌లో నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. దేశంలో జరిగిన వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. వీటివల్ల కొన్నిసార్లు వివాదాల్లో సైతం ఇరుక్కుంటూ ఉంటుంది. అయినా తన పంథా తనదే. ఏమాత్రం మారదు. తాజాగా ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కి ట్వీట్‌కి రిప్లై ఇచ్చింది. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎలన్ మస్క్ (Elon Musk) చేసిన ట్వీట్‌లో.. ‘మీరు ఒకరితో ప్రేమలో పడినప్పుడూ.. ప్రభుత్వాన్ని పడేయడానికి మీరు జీవితాన్ని అంకితం చేసినప్పుడూ.. దృష్టిని మరల్చడానికి సీఐఏ ఓ యాక్టర్ పంపిందని తెలిస్తే.. అప్పుడు మీరు ప్రేమను చూసే కోణం మారుతుంది’ అని రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ చాలా వైరల్ అయ్యింది. దీంతో ఎలన్ పోస్ట్‌ని ఇప్పటికే దాదాపు 62 మిలియన్ల మంది చూడడం విశేషం. ఈ పోస్ట్‌పైనే తాజాగా కంగనా స్పందించింది.

అందులో.. ‘నా కంటే నాటకీయమైన జీవితం ఎవరికైనా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మొత్తం మూవీ మాఫియా (Movie Mafia) కలిసి ఓ ప్రేమ వ్యవహారం (Love affair)లో నన్ను జైలుకి పంపడానికి ప్రయత్నించడం కంటే.. మీ కథ చాలా ఎగ్జాయిటింగ్‌గా ఉంది’ అని అందులో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఎంతోమంది కంగనని ప్రేమపై తన అభిప్రాయం గురించి అడుగుతున్నారు.


దానికి సమాధానంగా.. ‘ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది.

1. తల్లిదండ్రులు, తొబుట్టువులు, పెంపుడు జంతువులు, బంధువుల ప్రేమ (ఇచ్చిపుచ్చుకోవడం)

2. సెక్సువల్ లేదా ఉద్వేగభరితమైన ప్రేమ (ఇచ్చిపుచ్చుకోవడం)

3. ఆధ్యాత్మిక ప్రేమ లేదా దైవిక ప్రేమ (ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు).. రెండు ఒకరే చేస్తారు

మొదటి రెండు అందరికి తెలుసు.. కాని. మూడోది మాత్రం కొందరికి మాత్రమే..’ అని రాసుకొచ్చింది. (Kangana Opinion On Love)

కాగా.. గత కొన్నేళ్ల క్రితం హృతిక్ రోషన్‌తో కంగనా రనౌత్ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. అనంతరం వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అనంతరం కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-20T12:26:15+05:30 IST