Kajol: షాకింగ్ పోస్ట్ పెట్టిన కాజోల్, వర్రీ అవుతున్న అభిమానులు

ABN , First Publish Date - 2023-06-09T18:31:02+05:30 IST

హిందీ నటి కాజోల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె సాంఘీక మాధ్యమాలకు కొన్నాళ్ల పాటు దూరంగా వుంటాను అని చెప్పి, కొన్ని పోస్ట్స్ డిలీట్ చేసింది. అభిమానులు అందరూ చాలా ఆందోళనలో వున్నారు.

Kajol: షాకింగ్ పోస్ట్ పెట్టిన కాజోల్, వర్రీ అవుతున్న అభిమానులు
Kajol

ప్రముఖ హిందీ నటుడు అజయ్ దేవగన్ (AjayDevgn) భార్య, నటి అయిన కాజోల్ (Kajol) ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది కూడా సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఆమె ఒక విచిత్రమైన అర్థం ధ్వనించేలా వచ్చేట్టు రాసిన ఒక వాక్యం పోస్ట్ చేసి సాంఘీక మాధ్యమం నుండి కొన్నాళ్ల పాటు దూరంగా వుంటాను అని పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు అందరూ షాకింగ్ లో వున్నారు. ఏమైంది అని ఆమెకి ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఆమె పెట్టిన ఆ ఇంగ్లీష్ పోస్ట్ కి పక్క తెలుగు అనువాదం ఇది. "నా జీవితంలో కష్టతరమైన పరీక్షల్లో ఒకటి ఎదుర్కొంటున్నాను", అని ఆమె పెట్టింది. (Facing one of the toughest trials of my life). ఇక్కడ ఇంకో విషయం కూడా వుంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించింది, దాని పేరు 'ది ట్రయల్' (TheTrial), అలాగే అదే పేరు వచ్చేట్టు ఆ పోస్ట్ కూడా పెట్టింది. అయితే ఆమెకి వ్యక్తిగతంగా ఏమైనా సమస్య వచ్చిందా, లేక పరిశ్రమ నుండి ఏదైనా సమస్య వచ్చిందా అన్న విషయం మాత్రం తెలీదు, ఆమె చెప్పలేదు కూడా.

kajol1.jpg

కొందరు ఏమంటున్నారు అంటే, ఆమె ఒక షో చేస్తోంది అని, దాని పేరు 'ది గుడ్ వైఫ్' (TheGoodWife) అని, దాని ప్రొమోషన్ లో భాగంగానే ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. ఎందుకంటే ఆ వెబ్ షో దర్శకుడు పి మల్హోత్రా (P Malhotra) ఈమె పోస్ట్ కి రిప్లై ఇస్తూ ఎప్పుడు ది గుడ్ వైఫ్ ట్రైలర్ వస్తోంది అని అడిగాడు. అందుకని ఆ షో ప్రచారంలో భాగంగానే ఇలా చేసిందేమో అని అంటున్నారు.

ట్విట్టర్ లో మాత్రం ఎటువంటి పోస్ట్ డిలేట్ చెయ్యలేదు కానీ, ఇన్స్టాగ్రామ్ లో చాలా పోస్ట్స్ డిలేట్ చేసింది అని చెప్తున్నారు. అక్కడ కూడా ఇదే పోస్ట్ పెట్టింది. ఒక బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో రెండు లైన్స్ మాత్రమే మధ్యలో రాసి ఈ పోస్ట్ పెట్టింది.

Updated Date - 2023-06-09T18:31:02+05:30 IST