Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

ABN , First Publish Date - 2023-04-03T12:31:12+05:30 IST

అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor).

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?
Janhvi Kapoor with Boyfriend

అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘ధడక్’ అనే ప్రేమ కథా చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా స్టార్ హీరోల సినిమాల చేస్తూ దూసుకుపోతోంది. అలాగే.. లేడీ ఓరియెంటెడ్ కథలతోనూ దూసుకెళుతోంది. అయితే.. ఈ భామ ఇటీవలికాలంలో సినిమా కంటే ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

జాన్వీ కపూర్ గతంలో కొంతకాలం శిఖర్ పహారియా (Shikhar Pahariya) అనే యువకుడితో డేటింగ్ చేసినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే.. మధ్యలో ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయారు. అయితే.. ఇటీవల ఎక్కువగా ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. దీంతో ఈ జంట మరోసారి డేటింగ్ చేస్తోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వార్తలపై ఇద్దరూ స్పందిచలేదు. ఈ తరుణంలోనే జాన్వీ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామిని గుడికి వెళ్లింది. ఆమెతో పాటు సోదరి ఖుషి కపూర్‌ (Khushi Kapoor)తో పాటు జాన్వీ రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్‌తో కావడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో‌తో పాటు ఫొటోలు సైతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

janhvi-kapoor.jpg

దీంతో పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. కొందరు జాన్వీకి సపోర్టుగా పోస్టులు పెడుతుంటే.. మరికొందరేమో విమర్శలు చేస్తూ రాసుకొస్తున్నారు. అందులో.. ‘ఏ సినిమా కోసం జాన్వీ ఇలా గుడికి వచ్చింది’.. ‘దేవుడి కోసం గుడికి వచ్చిందా లేక షో చేయడానికా?’ అని రాసుకొస్తున్నారు. అలాగే, ఆ వీడియోలో శిఖర్ ఉండడంతో ‘ఈ మధ్య వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ఇప్పుడు గుడికి కూడా వచ్చారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?’ అని కూడా రాసుకొస్తున్నారు. అలాగే.. ఇటీవలే జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ (Boney Kapoor)తో కలిసి శిఖర్ కనిపించాడు. దీంతో జాన్వీ, శిఖర్ బంధం త్వరలో అధికారికం కానుందని కూడా వార్తలు వస్తున్నాయి.

కాగా.. జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ (NTR) తన అభిమాన నటుడని, ఆయన కలిసి నటించాలని ఉందని జాన్వీ చెప్పింది. అనుకున్నట్లుగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఎన్టీఆర్ 30’ (NTR30)లో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Updated Date - 2023-04-03T12:34:02+05:30 IST