Janhvi Kapoor: ఇప్పుడు ప్రతి విషయం అమ్మకు చెప్పాలనుంది!

ABN , First Publish Date - 2023-12-15T16:33:26+05:30 IST

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌(Janhvi Kapoor). సెలెక్టివ్‌ క్యారెక్టర్స్‌ ఎంచుకుంటూ చక్కని గుర్తింపు పొందారు. ఉత్తరాదిలోనే కాకుండా ఇప్పుడు దక్షిణాదిలోనూ ఆమె అడుగుపెట్టింది.

Janhvi Kapoor: ఇప్పుడు ప్రతి విషయం అమ్మకు చెప్పాలనుంది!

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌(Janhvi Kapoor). సెలెక్టివ్‌ క్యారెక్టర్స్‌ ఎంచుకుంటూ చక్కని గుర్తింపు పొందారు. ఉత్తరాదిలోనే కాకుండా ఇప్పుడు దక్షిణాదిలోనూ ఆమె అడుగుపెట్టింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కెరీర్‌ బిగినింగ్‌లో శ్రీదేవి కుమార్తె అయిన కారణంగా అభద్రతాభావానికి గురైనట్లు తెలిపింది. తన తొలి సినిమా ‘ధడక్‌’ షూటింగ్‌కు శ్రీదేవిని రావొద్దని కూడా చెప్పినట్లు చెప్పింది జాన్వీ. (Janhvi Kapoor)

‘‘నేను శ్రీదేవి కుమార్తెను కావడంతో నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకుంటారు. అందుకే అమ్మను దూరంపెట్టాను. నా బ్యాగ్రౌండ్‌ను, అమ్మ నుంచి ఎలాంటి సాయం తీసుకోకూడదు అనుకున్నా. ఆమెలా కాకుండా భిన్నంగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించా. నా తొలి సినిమా సెట్స్‌కు కూడా ఆమెను రావొద్దని, నాకు సాయం చేయద్దని గట్టిగా చెప్పాను. ఆమె కూతురిగా ఇండస్ర్టీకి పరిచయమవ్వడంతో ఎందుకో ఇనసెక్యూరిటీగా అనిపించేది. అమ్మ సలహాలు కూడా తీసుకునేదాన్ని కాదు. నేనంత హాస్యాస్పదంగా ఆలోచించానో ఆ తర్వాత అర్థమైంది. ఇప్పుడు ప్రతి విషయం అమ్మకు చెప్పాలనిపిస్తుంది. ‘అమ్మా.. షూట్‌ ఉంది. త్వరగా రా’ అని ఆమెతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఆమె కూతురినైనందుకు ఇప్పుడు ఎంతో గర్వపడుతున్నా. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అని అభిమానులు అంటుంటే ఆనందంగా ఉంది ’అని చెబుతూ జాన్వీ భావోద్వేగానికి (Janhvi Kapoor) గురైంది.


ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’ (Devara) సినిమా చేస్తోంది.  తెలుగులో ఆమెకిది తొలి చిత్రం. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇందులో తంగమ్‌ అనే పాత్రలో కనిపించనుంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేస్తారు.

Updated Date - 2023-12-15T16:33:27+05:30 IST