Janhvi Kapoor : దేవర షూటింగ్.. జాన్వీ చెప్పిందంటే!
ABN , First Publish Date - 2023-12-04T09:46:55+05:30 IST
శ్రీదేవి (Sri devi) నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.. జాన్వీ కపూర్(Janhvi kapoor). ధడక్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన అతిలోక సుందరి కూతురు ‘దేవర’ (Devara) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్ యాక్షన్‌లో ఆమె కథానాయికగా నటిస్తోంది.
శ్రీదేవి (Sri devi) నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.. జాన్వీ కపూర్(Janhvi kapoor). ధడక్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన అతిలోక సుందరి కూతురు ‘దేవర’ (Devara) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్ యాక్షన్‌లో ఆమె కథానాయికగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. సైఫ్ అలీఖాన్ (Saif Ali khan) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ ఇందులో తంగమ్ అనే పాత్రలో కనిపించనుంది. తాజాగా సెట్‌లో ఈ సినిమా అనుభవాల్ని పంచుకుంది.
‘‘దేవర’ (Devara) కోసం సెట్లోకి అడుగు పెట్టిన ప్రతిసారీ నేను నా ఇంటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. సెట్లోని ప్రతి ఒక్కరూ నా సొంత మనుషుల అనిపిస్తారు. అంతే ప్రేమతో చూస్తారు. ఇది అమ్మతో నాకున్న తీవ్రమైన భావోద్వేగ అనుబంధం వల్ల జరుగుతుందనిపిస్తుంది. దేవర అవకాశంతో దక్షిణాదిన సినిమా చేయడం ద్వారా అమ్మతో అటాచ్ అయినట్లు అనిపిస్తోంది. ఇదొక ఆధ్యాత్మిక అనుభూతి’ అని జాన్వీ చెప్పుకొచ్చింది.
తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. దర్శకుడు రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం ‘దేవర పార్ట్-1గా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ధ్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు ఛాయగ్రాహకుడిగా పని చేస్తున్నారు.