Ira Khan: ఆ సమయంలో ఎనిమిది గంటలు ఏడుస్తూనే...
ABN , First Publish Date - 2023-07-09T17:41:21+05:30 IST
ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ భావోద్వేగానికి గురైంది. తన తల్లిదండ్రులు ఆమిర్ - రీనా దత్తా విడాకులు తీసుకున్న సమయంలో తాను మానసికంగా కుంగిపోయినట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ (Ira khan) భావోద్వేగానికి గురైంది. తన తల్లిదండ్రులు ఆమిర్ (Amir khan)- రీనా దత్తా (Reena dutta) విడాకులు తీసుకున్న సమయంలో తాను మానసికంగా కుంగిపోయినట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. తన తల్లిదండ్రుల విడాకులు నిర్ణయం తనపై ఎంతో ప్రభావితం చేసిందని తెలిపింది. ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు 2002లో విడాకులిచ్చారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘అమ్మా-నాన్న విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను. ఆ సంగతి తెలియగానే వెంటనే ఇండియాకు వచ్చేశా. వాళ్లు స్నేహపూర్వకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం తెలిసినా నాకు మానసికంగా ఎంతో బాధ కలిగింది. కొన్ని రోజులు అన్నం కూడా తినలేదు. రోజులో ఎనిమిది గంటలు ఏడుస్తూనే ఉండేదాన్ని. పది గంటలు నిద్రపోయేదాన్ని. ఏడాదిన్నరపాటు అలానే గచిపాను. (Amir khan - (Reena dutta Divorce)
అయితే ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. ఈ బాధకర విషయాన్ని చెప్పి ఎవరినీ బాధపెట్టడం ఇష్టం ఈ విషయం చెప్పి వాళ్లను బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండేది కాదు. అప్పటికే మా కుటుంబంలో కొంతమంది మానసిన రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేనూ చిన్న సమస్యను కూడా తట్టుకోలేక డిప్రెషన్‌కు వెళ్లాను. గతేడాది జులైలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమస్యకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడడం మానేశా. దాంతో విపరీతంగా బరువు పెరిగాను. డిప్రెషన్ నుంచి బయటపడ్డాని నిర్ణయించుకుని దానితో పోరాడడానికి నాకు నేను సిద్ధమయ్యా. ఇప్పుడు అంతా బాగుంది. ’’ అని ఐరా ఖాన్ చెప్పారు. రీనాతో విడాకుల తర్వాత 2005లో కిరణ్‌రావును వివాహం చేసుకున్నారు ఆమిర్. 15 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది.