Heroines: వర్షాకాల సౌందర్య చిట్కాలు.. హీరోయిన్లు ఏం చెబుతున్నారంటే..

ABN , First Publish Date - 2023-07-16T11:16:52+05:30 IST

వర్షాకాలం మొదలైందంటే చాలు... చర్మం పొడిబారడం, కాంతివిహీనంగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు సవాలుగా మారుతాయి. ఈ కాలంలో వెండితెర ముద్దుగుమ్మలు మేకప్‌ను ఎలా మేనేజ్‌ చేస్తారు? వివిధ సందర్భాల్లో వారు చెప్పిన కొన్ని వర్షాకాల సౌందర్య చిట్కాలివి...

Heroines: వర్షాకాల సౌందర్య చిట్కాలు.. హీరోయిన్లు ఏం చెబుతున్నారంటే..

వర్షాకాలం మొదలైందంటే చాలు... చర్మం పొడిబారడం, కాంతివిహీనంగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు సవాలుగా మారుతాయి. ఈ కాలంలో వెండితెర ముద్దుగుమ్మలు మేకప్‌ను ఎలా మేనేజ్‌ చేస్తారు? వివిధ సందర్భాల్లో వారు చెప్పిన కొన్ని వర్షాకాల సౌందర్య చిట్కాలివి...

వారానికి రెండుసార్లు స్క్రబ్‌ (yami goutham)

కొన్నిసార్లు వర్షంలో తడవాల్సి వస్తుంది. అలా తడిసిన ప్రతీసారీ తలస్నానం చేయడం కుదరకపోవచ్చు. అందుకే ఆ సమయంలో డ్రై షాంపు ఉపయోగిస్తుంటా. అలాగే కుదుళ్లు దృఢంగా ఉండేందుకు బాదం నూనెలో కొన్ని మెంతి గింజలు వేసి, దానిని తలకు పట్టిస్తా. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ముఖాన్ని స్క్రబ్‌ చేసుకోవడం మంచిది. ముఖం జిడ్డుగా మారకుండా టోనర్‌ని ఉపయోగించాలి. ఇది చర్మం పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేసి, మొటిమలు ఏర్పడకుండా కాపాడుతుంది.

- యామీ గౌతమ్‌

6.jpg

మ్యాట్‌ ఫినిషింగ్‌ కోసం... (Malavika Mohanan)

మాన్‌సూన్‌ సీజన్‌లో మేకప్‌ ఎక్కువసేపు ఉండేందుకు క్రీమ్‌ ఆధారిత ఉత్పత్తులకు బదులుగా పౌడర్‌ ఆధారిత ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది మ్యాట్‌ ఫినిషింగ్‌ని ఇస్తుంది. ముఖం మీద మేకప్‌ ప్యాచ్‌లాగ కాకుండా నీట్‌గా కనిపించాలంటే.. మేకప్‌ వేసుకోవడానికి ముందు ఐస్‌ ముక్కలతో ముఖంపైన, మెడపైన మర్దన చేసుకోవాలి. ఐ షాడో వేసుకోవడం తప్పనిసరైతే మాత్రం లేత గులాబీ లేదా లేత గోధుమ రంగు ఉన్న షేడ్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఈ సీజన్‌కు అవి సరిగ్గా నప్పుతాయి. అలాగే వాటర్‌ ప్రూఫ్‌ ఐ లైనర్‌, మస్కారను ఎంపిక చేసుకోవాలి.

- మాళవిక మోహనన్‌

Malavika.jpg

కేశాలకు సీరం తప్పనిసరి (Mithila Palkar)

నాది ఉంగరాల జుట్టు కావడంతో కేశాలపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా నాతో పాటు హెయిర్‌ సీరమ్‌ని తీసుకెళ్తా. జుట్టు ఫ్రీజ్‌ అవుతున్నట్లు అనిపిస్తే రెండు, మూడు చుక్కల సీరం తలకు రాస్తా. దాంతో జుట్టు మృదువుగా మారుతుంది. సమయం ఎక్కువగా లేకుంటే జుట్టుకు డ్రై షాంపు అప్లై చేస్తా. దీనివల్ల తలస్నానం చేసిన ఫీల్‌ కలుగుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యానికే కాదు... చర్మ సౌందర్యానికీ ఇవి సహాయపడతాయి.

- మిథిలా పాల్కర్‌

3.jpg

కొబ్బరినూనెతో మసాజ్‌

వానాకాలంలో జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే జుట్టు రాలే ప్రమాదం ఉంది. నా వరకు సహజసిద్ధమైన కొబ్బరి నూనె బెస్ట్‌. కొబ్బరి నూనెని కాస్త వేడి చేసి అది చల్లారాక జుట్టుకు బాగా పట్టిస్తా. తర్వాత ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేస్తుంటా. కొబ్బరి నూనె జుట్టు కుదుళ్ల లోపలికి వెళ్లి తగినంత పోషణను అందిస్తుంది. దాంతో చిగుళ్లు చిట్లిపోకుండా, జుట్టు ఫ్రీజ్‌ అవ్వకుండా ఉంటుంది. ఈ మసాజ్‌ జుట్టుకు స్పా చికిత్సలా పనిచేస్తుంది కూడా.

- దీపికా పదుకొణె (Deepika Padukone)

2.jpg

కాస్త మేకప్‌ చాలు.. (Disha Patani)

ఆయా కాలాలకు తగ్గట్టుగా చర్మ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ కాలంలో మేకప్‌ ఎక్కువగా వేసుకోకపోవడమే మంచిది. బయటకి వెళ్లాల్సి వస్తే వాటర్‌ ప్రూఫ్‌ ఉత్పత్తులు ఉపయోగించాలి. ఈ సీజన్‌లో చర్మం తరుచుగా పొడిబారుతుంది. అందుకే మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా అప్లై చేయాలి. పార్టీకి హాజరవ్వాల్సి వస్తే మాత్రం... ఫేస్‌ మేకప్‌ తక్కువగా వేసి, ఐ మేకప్‌ని హైలైట్‌ చేయాలి.

- దిశా పటానీ

Updated Date - 2023-07-16T11:21:14+05:30 IST