Genelia: ఇప్పుడొస్తున్న సినిమాలు, సిరీస్‌ల గురించి జెనీలియా ఏమన్నారంటే!
ABN , First Publish Date - 2023-07-20T21:06:34+05:30 IST
‘బొమ్మరిల్లు’లో హాసిని, ‘బాయ్స్’లో హరిణిగా అలరించింది జెనీలియా. పెళ్ళి. పిల్లల్లు పుట్టడం తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి ‘మిస్టర్ మమ్మీ’, ‘వేద్’ సినిమాలతో అలరించింది. ఇప్పుడు ఓటీటీలో అడుగేయడానికి సిద్దమైంది.
‘బొమ్మరిల్లు’లో హాసిని, ‘బాయ్స్’లో హరిణిగా అలరించింది జెనీలియా. పెళ్ళి. పిల్లల్లు పుట్టడం తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి ‘మిస్టర్ మమ్మీ’, ‘వేద్’ సినిమాలతో అలరించింది. ఇప్పుడు ఓటీటీలో అడుగేయడానికి సిద్దమైంది. ఆమె కీలక పాత్రలో ‘ట్రయల్ పీరియడ్’ (Trial Period) అనే వెబ్‌సిరీస్ రూపొందింది. జులై 21 నుంచి ఓటీటీ ‘జియో సినిమా’ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జెనీలియా మీడియాతో మాట్లాడారు. ‘‘ట్రయల్ పీరియడ్ కథ విన్న వెంటనే ఓకే చేశాను. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నేను రీఎంట్రీ అనుకున్న సమయంలో ఈ స్ర్కిప్ట్ నా దగ్గరకు వచ్చింది. నేను ఏదైనా ప్రాజెక్ట్‌ను అంగీకరించాలంటే కథ చదవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. కానీ, ఈ వెబ్‌సిరీస్ కథను గంటలో చదివేసి ఓకే చేశాను. అంత ఆసక్తిగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో కుటుంబమంతా కలిసి సినిమాలు, సిరీస్‌లు తగ్గిపోయాయని నా అభిప్రాయం. నిజంగా పిల్లలతో కలిసి చూడలేకపోతున్నాం. అందుకే కుటుంబం అతాఆ కలిసి చూసేలా ఉండే ‘ట్రయల్ పీరియడ్’ కథను ఎంచుకున్నాం. ఇందులో నేను ఒంటరి మహిళ పాత్రలో కనిపిస్తా. అలేయా సేన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది’’ అని అన్నారు. 11 ఏళ్ల తర్వాత జెనీలియా తెలుగులో ‘జూనియర్’ అనే సినిమాలో నటిస్తోంది.