Dunki: షారుక్‌కి హ్యాట్రిక్ సాధ్యమా? నెటిజన్లు ఏమంటున్నారంటే..!
ABN , Publish Date - Dec 21 , 2023 | 10:31 AM
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ హ్యాట్రిక్ దిశగా పరుగులు తీస్తున్నారు. ఆయన నటించగా ఈ ఏడాది విడుదలైన పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టాయి. తాజాగా ఆయన హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’.
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ (Shah rukh khan) హ్యాట్రిక్ దిశగా పరుగులు తీస్తున్నారు. ఆయన నటించగా ఈ ఏడాది విడుదలైన పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టాయి. తాజాగా ఆయన హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’ (Dunki) . జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. మొదటి నుండి డంకీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు డంకీ కథ ఏంటి? షారుక్‌కి హ్యాట్రిక్ సాధ్యమైందా లేదా? అన్నది తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా నెటిజన్లు చర్చిస్తున్నారు.
రాజ్‌కుమార్ హిరాణీ దర్శకుడు కావడంతో సినిమాకు హైప్ బాగా వచ్చింది. షారుక్ హ్యాట్రిక్ ఖాయం అని అభిమానులు మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. డంకీ.. ఓ మాస్టర్ పీస్. కథ చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్‌గా ఉంది. ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. స్టార్ట్ టు ఎండ్ సీట్లకు అత్తుకునపోయి చూస్తారు’ అని కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ 5/5 రేటింగ్ ఇచ్చాడు. కానీ సోషల్ మీడియా కొందరి టాక్‌ను బట్టి చూస్తే సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని కొంతమంది కామెంట్ చేస్తుంటే. యావరేజ్‌మూవీ అని.. భరించడం చాలా కష్టమని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ట్విట్టర్‌లో మాత్రం నెగెటివ్ కంటే ఎక్కువగా పాజిటివ్ పోస్టులే కనిపిస్తున్నాయి. కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణి తనదైన స్ర్కీన్‌ప్లేతో మాయ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరో నెటిజన అయితే షారుఖ్ ఖాన్ మరోసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నాడు అని కామెంట్ చేశాడు.
డంకీ బ్లాక్ బస్టర్ కాదు.. మెగా బ్లాక్ బస్టర్ మూవీ. షారుక్ పాత్క మీ మైండ్‌ని బ్లాంక్ చేస్తుంది. స్టోరీ అదిరిపోయింది. తప్పకుండా చూడండి అని ఓ అభిమాని రాసుకొచ్చాడు.
బోర్ కొట్టించేశాడు. షారుక్ యాక్టింగ్ బాగున్నా.. డైలాగ్ డెలివరీ భరించడం కష్టంగా ఉంది. హిరాణీ రాజ్‌కుమార్ నుంచి వచ్చిన పేలవమైన చిత్రమిది. ఓటీటీలో రిలీజ్ అయ్యేంతవరకు ఎదురుచూడడం బెటర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.