Dunki: హిందీ రాకుండా.. బ్రిటీష్ వారు ఇండియాకి ఎలా వ‌చ్చారు! అదిరిన షారుఖ్ ‘డంకీ’ ట్రైల‌ర్‌

ABN , First Publish Date - 2023-12-05T11:37:11+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నుంచి తాజాగా వ‌స్తున్న మ‌రో చిత్రం ‘డంకీ’. ఈ ఏడాది ముచ్చ‌ట‌గా మూడో సినిమాతో షారుఖ్ వ‌స్తుండడంతో సినిమాపై అంచ‌నాలు రెండింత‌లు పెరిగాయి. అయితే తాజాగా ఈ రోజు (మంగ‌ళ‌వారం) రోజున డంకీ డ్రాప్ 4పేర సినిమా ఫైన‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ది.

Dunki: హిందీ రాకుండా.. బ్రిటీష్ వారు ఇండియాకి ఎలా వ‌చ్చారు! అదిరిన షారుఖ్ ‘డంకీ’ ట్రైల‌ర్‌
DUNKI

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) నుంచి తాజాగా వ‌స్తున్న మ‌రో చిత్రం ‘డంకీ’(Dunki). ఈ ఏడాది ఇప్ప‌టికే షారుఖ్‌ జ‌న‌వ‌రిలో 'ప‌ఠాన్‌(Pathaan), సెప్టెంబ‌ర్‌లో 'జ‌వాన్ (Jawan) సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొటి ప్ర‌పంచ వ్యాప్తంగా వెయ్యి కొట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొళ్ల‌గొట్టి జోరుమీదుండ‌గా ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమాగా వ‌స్తున్న‌ ఈ సినిమాపై కూడా అంచ‌నాలు రెండింత‌లు పెరిగాయి. అయితే తాజాగా ఈ రోజు (05.12.2023) మంగ‌ళ‌వారం రోజున డంకీ డ్రాప్ 4పేర సినిమా ఫైన‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ది.

ట్రైల‌ర్‌లో విదేశాల‌కు వెళ్లి చ‌దువుకోవాల‌ని క‌ల‌లు క‌నే నలుగురు స్నేహితుల‌కు సంబంధించిన క‌థ‌ను సింపుల్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. 3 నిమిషాల 2 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ లో పంజాబ్ లో నివసించే నలుగురు యువతీ యువకులు లండన్‌లో సెటిల్‌ అవ్వాలని కలలు కంటూ ఉండడం, ఆ క్రమంలో ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు ప్రయత్నించి విఫలం అవడం, వీసా రాక పోవడంతో లండన్‌ వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతున్నది.

అయితే ఇంగ్లిష్ రాని వారు లండ‌న్ వెళ్ల‌డానికి ప‌నికి రాకుంటే , మ‌రి బ్రిటీష్ వారు హిందీ రాకుండా ఎలా వ‌చ్చారంటూ సాగే డైలాగ్స్ ఆలోచంప‌జేపే విధంగా ఉన్నాయి. అదే క్ర‌మంలో ఆ మిత్రులు బోర్డ‌ర్స్ ఎలా దాటారు, చివ‌ర‌కు అక్క‌డ‌కు చేరుకున్నారా అనే ఇతివృత్తంతో నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ప్రేమ‌, స్నేహం క‌ల‌యిక‌గా ఈ సినిమా రూపొందించారు ట్రైల‌ర్ మ‌న‌లోని భావోద్వేగాల‌ను తాకుతూ చ‌క్క‌గా న‌వ్వుకునేలా, హృద‌యం ఆక‌ట్టుకునే విధంగా ఉండి ప్రేక్ష‌కులకు వెంట‌నే క‌నెక్ట్ అయ్యేలా ఉంది. అయితే ఈ డంకీ(Dunki) సినిమాను డిసెంబ‌ర్ 21 న విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్‌ స‌న్నాహాలు చేస్తున్నారు.


షారుఖ్‌ఖాన్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్‌2న డంకీ డ్రాప్‌1 పేర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా 24 గంట‌ల్లో ఏకంగా 72 మిలియ‌న్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. అదే కోవ‌లో న‌వంబ‌ర్ 22 న‌ అర్జిత్ సింగ్ పాడిన ‘లుట్ పుట్ గయా..’ అనే రొమాంటిక్ సాంగ్‌ డంకీ డ్రాప్ 2గా (Dunki Drop2 Lutt Putt Gaya) , సోనూ నిగ‌మ్ ఆల‌పించిన‌ ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ వ‌చ్చిన పాట‌ను డంకీ డ్రాప్ 3(Dunki Drop3)గా మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా వీటన్నింటికీ దేశం న‌లువైపుల నుంచి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. .

హృద‌యాల‌కు హ‌త్తుకునే ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ రూపొందించే రాజ్‌కుమార్ హిరాణి (Rajkumar Hirani) ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా, జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా ప‌ని చేశారు. ప్రీత‌మ్ సంగీతం అందించారు.

ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు ద‌ర్మేంద్ర‌, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమ‌న్ ఇరానీ, దియా మిర్జా, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇదిలాఉండ‌గా ఈ సినిమా రిలీజ్ అవుతున్న మ‌రుస‌టి రోజే డిసెంబ‌ర్ 22న‌ ప్ర‌భాస్ 'స‌లార్ (Salaar) కూడా దేశ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌డం విశేషం.

Updated Date - 2023-12-05T11:50:01+05:30 IST