Dunki vs Salaar: 'సలార్' సినిమాతో మా సినిమా స్క్రీన్ షేర్ చెయ్యొద్దు, షరతు పెట్టిన 'డంకీ' నిర్మాతలు

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:01 PM

ఇంతకు ముందు షారుఖ్ సినిమాలు విడుదలైనట్టుగా, ఈ 'డంకీ' సినిమా ప్రాంతీయ భాషల్లో విడుదలవటంలేదు, కానీ 'సలార్' తెలుగులోనే కాకుండా ఇతర ప్రాంతీయ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది, అదేంటంటే...

Dunki vs Salaar: 'సలార్' సినిమాతో మా సినిమా స్క్రీన్ షేర్ చెయ్యొద్దు, షరతు పెట్టిన 'డంకీ' నిర్మాతలు
Dunki makers put a condition on Distributors

ఈ వారం ఇద్దరు స్టార్స్ ఒకరు హిందీ నటుడు షారుఖ్ ఖాన్, ఇంకొకరు తెలుగు నటుడు ప్రభాస్ తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. షా రుఖ్ ఖాన్ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు పెద్ద విజయాలు సాధించి చాలా ఉత్సాహంగా వున్నారు. 'పఠాన్', 'జవాన్' లతో రెండు హిట్స్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు మూడో హిట్ 'డంకీ' ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. ఇక ప్రభాస్ ఇంతకు ముందు 'ఆదిపురుష్' సినిమా విడుదలైంది, దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. రామాయణం ప్రాతిపదికగా తీసిన సినిమా అని చెప్పారు, కానీ ప్రేక్షుకులకి అది అంతగా రుచించలేదు.

SRK---Dunki.jpg

ఇప్పుడు ఈ ఇద్దరు నటులు 'డంకీ', 'సాలార్' #Salaar సినిమాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆసక్తికరం ఏంటంటే షారుఖ్ ఖాన్ ముందు రెండు సినిమాలు హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళంలో కూడా విడుదలయ్యాయి. కానీ ఈసారి ఎందుకో 'డంకీ' #Dunki సినిమా కేవలం హిందీలోనే విడుదల చేస్తున్నారు. కానీ 'సలార్' మాత్రం తెలుగులోనే కాకుండా మిగతా భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది.

అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే, షారుఖ్ ఖాన్ ఇంతకు ముందు సినిమాలకి ఇతర ప్రాంతాలకి వెళ్లి ప్రచారాలు చేశారు, కానీ ఈసారి ఎందుకో దక్షిణాదిన అంతగా ప్రచారాలు నిర్వహించలేదు. ఇక 'సలార్' కూడా అంతగా ప్రచారాలు ఎక్కడా నిర్వహించలేదు. రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ ప్రచార వీడియో చేయించారు తప్పితే, టీము ఎందుకో ఎక్కడికీ వెళ్ళలేదు, ప్రచారాలు చెయ్యలేదు. అలాగే ప్రీ-రిలీజ్ వేడుకలు లాంటివి కూడా చెయ్యలేదు. తెలుగులో అయితే 'సలార్' ఓపెనింగ్స్ మునుపెన్నడూ ఏ సినిమాకి లేనంత విధంగా ఉన్నాయని చెప్పవచ్చు, కానీ హిందీలో మాత్రం అంతగా లేవని అంటున్నారు. అక్కడ షారుఖ్ ఖాన్ 'డంకీ' ముందంజలో వుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.
Salaar-2.jpg

అయితే షారుఖ్ ఖాన్ సినిమా డిసెంబర్ 21న విడుదలవుతోంది, అంటే 'సలార్' కన్నా ఒక రోజు ముందు, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టడానికి చేసిన ప్రయత్నం. ఇక హిందీ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి 'డంకీ' చిత్ర నిర్వాహకులు ఒక షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. 'మీరు చూపిస్తే మొత్తం నాలుగు ఆటలు మా సినిమా చూపించండి, మా సినిమా 'సలార్' సినిమాతో కలిపి చూపించవద్దు', కావాలంటే మొత్తం 'సలార్' చూపించండి, మా సినిమా చూపించనవసరం లేదు', అని డిస్ట్రిబ్యూటర్స్ కి షరతు పెట్టారని తెలిసింది. దీనితో అక్కడ 'సలార్' సినిమాకి షోస్ ఎక్కువగా దొరకలేదని కూడా ఒక వార్త వస్తోంది.

Updated Date - Dec 20 , 2023 | 05:01 PM