Deepika padukone: శ్రీవారి సేవలో దీపికా పదుకొణె

ABN , First Publish Date - 2023-12-15T10:50:58+05:30 IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నడక దారి ద్వారా భక్తులతో కలిసి దాదాపు ముడున్నర గంటలపాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.

Deepika padukone: శ్రీవారి సేవలో దీపికా పదుకొణె

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika padukone) తిరుమల శ్రీవారిని (Tirumala) దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నడక దారి ద్వారా భక్తులతో కలిసి దాదాపు ముడున్నర గంటలపాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిథి గృహంలో బస చేసారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు ప్రసాదం అందజేశారు. ఆమెతోపాటు సోదరి అనీషా కూడా ఉన్నారు. కాలిబాట మధ్యలో దీపికాతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు.

Deepika.jpeg

Updated Date - 2023-12-15T11:44:08+05:30 IST