నిన్న రష్మిక, కత్రినా, నేడు కాజోల్‌.. ఎఐ టెక్నాలజీకి బలి!

ABN , First Publish Date - 2023-11-16T18:46:13+05:30 IST

Kajol Deep Fake video: నిన్న రష్మిక, కత్రినా, నేడు కాజోల్‌ డ్రెస్‌ ఛేంజింగ్‌ వీడియో ఇదిగో అంటూ నెట్టింట ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే!

నిన్న రష్మిక, కత్రినా, నేడు కాజోల్‌.. ఎఐ టెక్నాలజీకి బలి!

నిన్న రష్మిక(Rashmika mandanna), కత్రినా (Katrina), నేడు కాజోల్‌ (Kajol) డ్రెస్‌ ఛేంజింగ్‌ వీడియో ఇదిగో అంటూ నెట్టింట ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! బ్రిటీష్‌ ఇండియన్  విమెన్  ఇనఫ్లూయెన్సర్‌ జారా పటేల్‌ డీప్‌ నెక్‌ ధరించిన ఓ వీడియోకి ఎఐ టెక్నాలజీ ద్వారా రష్మిక ఫేస్‌ను జోడించి నెట్టింట వైరల్‌ చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినీ రాజకీయ ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. అది మరువక ముందే కట్రీనా కైఫ్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్‌ అయింది. (kajol dress changing video)

తాజాగా మరో బాలీవుడ్‌ హీరోయిన్  ఎఐ టెక్నాలజీకి టార్గెట్‌ (Kajol deep fake video) అయింది. ఎఐ ఆకతాయిలు కాజోల్‌ డీప్‌ ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశారు. ఇంగ్లిష్‌ సోషల్‌ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌ రోజీ బ్రీన్ (Rosie Breen)  ఈ ఏడాది జూన్ లో 'గెట్‌ రెడీ విత్  మి’ అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోకు కాజోల్‌ ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి 'కాజోల్‌ డ్రెస్‌ ఛేంజింగ్‌ వీడియో’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు కాజోల్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఐ టెక్నాలజీ సెలబ్రిటీలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

కొద్ది రోజులు క్రితం రష్మిక విషయంలో ఇదే జరిగితే.. టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారంటూ అబితాబ్ బచ్చ న్  నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ, కీర్తి సురేశ్  వంటి స్టార్లు స్పందించి, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-11-16T19:39:50+05:30 IST