Dalip Tahil - Jayaprada : ఎంత హాస్యాస్పదం.. దయచేసి ఆ సినిమా ఏంటో చెప్పండి!

ABN , First Publish Date - 2023-10-26T20:18:04+05:30 IST

బాలీవుడ్‌లో సీనియర్‌ నటుడు దాలిప్‌ తాహిల్‌ (Dalip Thahil) ఎన్నో చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.

Dalip Tahil - Jayaprada : ఎంత హాస్యాస్పదం.. దయచేసి ఆ సినిమా ఏంటో చెప్పండి!

బాలీవుడ్‌లో సీనియర్‌ నటుడు దాలిప్‌ తాహిల్‌ (Dalip Thahil) ఎన్నో చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. 1974లో విడుదలైన ‘అంకుర్‌’(Ankur) తో దాహిల్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘శక్తి’, ‘గాంధీ’, ‘జల్వా’, ‘బాజీఘర్‌’, ‘హిట్‌ : ది ఫస్ట్‌ కేస్‌’, ‘ఇష్క్‌’, ‘రేస్‌’, ‘హలో’, ‘ప్రిన్స్‌’, ‘దర్బార్‌’ ‘సలామ్‌ ముంబై’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ భాగమయ్యారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో జయప్రద తనని చెంపదెబ్బ కొట్టారంటూ జరిగిన ప్రచారం గురించి మాట్లాడారు. (jayaprada)

‘‘నటి జయప్రద అంటే నాకెంతో గౌరవం. ఆమె ఎంతో అందమైన హీరోయిన్. ఓ సినిమా సెట్‌లో ఆమె నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వచ్చిన గాసిప్పులు చూసి ఆశ్చర్యపోయా. ఇంతకీ ఆ సంఘటన ఏ సినిమా సెట్‌లో చోటు చేసుకుందో చెబితే నేనూ తెలుసుకుంటా. ఎందుకంటే నేను ఇప్పటి వరకూ జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ఇది ఎంతో హాస్యాస్పదమైన వార్త. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ నేను విలన పాత్రలే ఎక్కువగా చేశా. అందువల్ల అత్యాచారం సన్నివేశాలు నాతో చిత్రీకరించేవారు. అలాంటి సీన్‌ ఏదైనా ఉంటే.. నాతోపాటు హీరోయిన్‌కి కూడా ముందే చెప్పమనేవాడిని. వాళ్లు అంగీకరిస్తేనే ఆ సీన్‌లో నటిస్తానని.. లేకపోతే చేయనని చెప్పేేసవాడిని. ఒకవేళ దర్శకుడు బలవంతం చేసి ఆ సీన చేయమంటే సెట్‌ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడిని’’ అని ఆయన తెలిపారు.

Updated Date - 2023-10-26T20:18:04+05:30 IST