Actress Nagma: నగ్మాపై సైబర్ దాడి.. అలా జరగడం అదృష్టమంటూ..
ABN , First Publish Date - 2023-03-09T12:39:21+05:30 IST
గత కొంతకాలంగా సైబర్ నేరాలు (Cyber Frauds) పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా సైబర్ నేరాలు (Cyber Frauds) పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రజలకి అవగాహన కలిగించిన వీటికి ఏమాత్రం అడ్డుకట్టపడడం లేదు. రోజుకో రకమైన ఐడియాతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఉచ్చులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోతున్నారు. తాజాగా సినీయర్ నటి, పొలిటిషియన్ నగ్మా (Nagma) సైబర్ ఉచ్చులో చిక్కుకుని రూ. లక్ష వరకు మోసపోయారు.
నగ్మా మొబైల్‌కి తాజాగా ఓ లింక్ వచ్చింది. మొదట దానిపై క్లిక్ చేసింది. అనంతరం ఓ వ్యక్తి ఫోన్ చేసి కేవైసీ అప్‌డేట్ చేయడానికి సమాచారం అడిగాడు. కానీ, అతన్ని అనుమానించిన నగ్మా వివరాలను తెలపలేదు. అయినప్పటికీ రూ.1 లక్ష వరకు కొట్టేశారని తెలిపారు. దీంతో అప్రమత్తమైన నగ్మా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. అందులో.. ఆమెకి ప్రైవేట్ నంబర్ నుంచి కాకుండా బ్యాంకుల పంపించేటట్లుగానే సందేశం వచ్చినట్లు తెలియజేశారు. ఆమె కాకుండా అదే బ్యాంకుకి సంబంధించిన మరో 80 వినియోగదారులు సైతం ఇలాగే మోసపోయినట్లు తెలిసింది. దీంతో కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు. (Cyber Fraud)
అనంతరం నగ్మా మాట్లాడుతూ.. ‘ఆ నేరగాళ్లు నా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయ్యి.. బెనిఫియరీ ఖాతాను సృష్టించారు. అనంతరం రూ. 1 లక్షను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఆ సమయంలో నాకు దాదాపు 20 వరకు ఓటీపీలు వచ్చాయి. అదృష్టం ఉండడం వల్ల అందులో తక్కువ మొత్తమే నష్టపోయాను’ అని చెప్పుకొచ్చారు. (Cyber Fraud)
ఇవి కూడా చదవండి:
Sri Devi 2.0: పల్లెటూరి యువతిలా మారిపోయిన జాన్వీ.. చూపు తిప్పుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
OTT Release: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?
Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా
Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి
Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?