Sidharth Malhotra-Kiara Advani: భారీ ఎత్తున విందు ఏర్పాటు.. అతిథులెవరంటే..
ABN , First Publish Date - 2023-02-11T15:12:24+05:30 IST
బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) లు ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జై సల్మీర్‌లోని సూర్య గఢ్ ఫ్యాలెస్‌లో ఈ పెళ్లి వైభవంగా జరిగింది.
బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) లు ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జై సల్మీర్‌లోని సూర్య గఢ్ ఫ్యాలెస్‌లో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీశ్ మల్హోత్రా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వంటి తదితర సెలబ్రిటీలు ఈ పెళ్లిలో సందడి చేశారు. ఏడడుగులు వేసిన సందర్భంగా నూతన దంపతులు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరు దీవెనలు, ఆశీర్వాదాలు అందించాలని కోరారు. అయితే, కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కొత్త జంట భారీ ఎత్తున విందును ఇవ్వనున్నారు.
సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీలు కుటుంబ సభ్యులు, బాలీవుడ్ స్నేహితుల కోసం ముంబైలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్లో ఫిబ్రవరి 12న భారీ ఎత్తున విందును ఇవ్వనున్నారు. ఈ పార్టీకి సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, వరుణ్ ధావన్, భూషణ్ కుమార్, మిరా రాజ్‌ఫుత్, షాహిద్ కపూర్ (Shahid Kapoor), కరణ్ జోహార్ (Karan Johar) హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వానాన్ని అందరికి పంపించినట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘షేర్ షా’ (Shershaah) సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీలు జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరికి పరిచయం అయింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఏడడుగులు వేశారు.