Bobby Deol : బాబీ ఫిట్‌నెస్ గురించి ట్రైనర్ ఏమన్నారంటే..!
ABN , First Publish Date - 2023-11-26T11:07:28+05:30 IST
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘యానిమల్’. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy vanga) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘యానిమల్’ (Animal). ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో బాబీ నటన ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆయన ఫిట్‌నెస్ గురించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాబీ ఫిట్‌నెస్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘దాదాపు ఆరేళ్ల నుంచి బాబీ దేవోల్‌కి ట్రైనర్‌గా పనిచేస్తున్నా. ‘యానిమల్’లో ప్రతినాయకుడి క్యారెక్టర్ కోసం ఆయన్ని ఎంచుకున్నప్పుడు లుక్ విషయంలో చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి పలు సూచనలు ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్ కంటే భారీగా బాబీ కనిపించాలన్నారు. అందుకు నాలుగు నెలల సమయం ఇచ్చారు. స్వీట్స్ తినకుండా కచ్చితమైన డైట్ ఫాలో అవుతూ ఆయన కఠినమైన సాధన చేశారు. ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్ చూసి టీమ్ ఎంతో ఆనందించింది. ముఖ్యంగా క్లైమాక్స్ షూట్ రోజు బాబీ నన్ను సెట్‌కు ఆహ్వానించి ప్రశంసించారు’’ అని ప్రజ్వల్ అన్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది.