Brahmastra 2 & 3: విడుదలపై దర్శకుడి క్లారిటీ.. అందులోనూ ఓ ట్విస్ట్ పెట్టాడు.. అదేంటంటే..
ABN , First Publish Date - 2023-04-04T12:34:33+05:30 IST
తేడాది చాలా సినిమాలు విడుదల కాగా.. అందులో చాలా కొద్ది సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. వాటిలో అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఒకటి.
గతేడాది చాలా సినిమాలు విడుదల కాగా.. అందులో చాలా కొద్ది సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. వాటిలో అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఒకటి. ‘అస్త్రవర్స్’ (Astraverse)లో భాగంగా మూడు భాగాలు ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా బాలీవుడ్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తున్న దశలో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది. అయితే సినిమా హిటైనప్పటికీ కథ, కథనం పరంగా ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. మంచి కథని అయాన్ అంత గ్రిప్పింగ్‌గా నడిపించలేకపోయాడని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం తదుపరి రెండు భాగాల గురించి సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలోనే ‘బ్రహ్మాస్త్ర 2 & 3’ భాగాల విడుదల గురించి దర్శకుడు క్రేజీ న్యూస్ చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ నోట్‌ని దర్శకుడు అయాన్ విడుదల చేశాడు. ఆ నోట్‌ని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్, సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి ‘బ్రహ్మాస్త్ర 2’ని 2026లో, ‘బ్రహ్మాస్త్ర 3’ని 2027లో విడుదల చేయాలని అయాన్ నిర్ణయించుకున్నట్లు తరణ్ రాసుకొచ్చాడు. (Brahmastra 2 and 3 release date)
అలాగే.. అయాన్ విడుదల చేసిన ఆ నోట్‌లో.. ‘బ్రహ్మాస్త్ర ట్రయాలజీ, అస్త్రవర్స్, నా జీవితం గురించి అప్‌డేట్ ఇచ్చే సమయంలో ఆసన్నమైంది. పార్ట్ 1పై మీ ప్రేమ, ఫిడ్‌బ్యాక్‌ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ... పార్ట్ 2, పార్ట్ 3 స్క్రిప్ట్‌పై నా దృష్టి సారించాను. ఇవి పార్ట్ 1 కంటే భారీగా, ప్రత్యేకంగా ఉంటాయని మాత్రం చెప్పగలను! అయితే.. మీ అభిప్రాయానికి, అభిరుచికి తగ్గట్లు బ్రహ్మాస్త్ర 2, 3 స్క్రిప్ట్‌ని పర్ఫెక్ట్‌గా చేయడానికి నాకు మరికొంత సమయం కావాలి అని తెలుసుకున్నాను!. అలాగే.. రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసిన చాలా తక్కువ గ్యాప్ విడుదల చేయాలని భావిస్తున్నాను. దానికి కొంచెం సమయం పట్టొచ్చు. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా’ అని తెలియజేశాడు.
దానికి కొనసాగింపుగా.. ‘విశ్వం నాకు ఇటీవల చాలా ప్రత్యేకమైన అవకాశాన్ని ఇచ్చింది. దర్శకత్వం వహించడానికి ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. దాని వల్ల నాలో పరిణతి ఇంకా పెరుగుతుంది. అందుకే ఆ మూవీకి దర్శకత్వం వహించాలని నిర్ణయం తీసుకున్నాను. నాలో పాజిటివ్ శక్తులను కూడగట్టుకుని భారతీయ సినిమా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’ అని అయాన్ పేర్కొన్నాడు. నిజానికి ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్’ (Brahmastra Part 2: Dev)ని 2025లోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకోగా.. ‘పార్ట్ 1: శివ’ విడుదల తర్వాత విమర్శలు రావడంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. కాగా.. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన ఈ చిత్రంలో ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్‌గా నటించింది.
ఇవి కూడా చదవండి:
Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..
Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్
Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..
Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?
Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో
Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..