Arbaaz Khan: మలైకాకు విడాకులు... షురా ఖాన్‌తో మరో పెళ్లి!
ABN , Publish Date - Dec 25 , 2023 | 05:24 PM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 1998లోనే నటి మలైకా అరోరాని వివాహమాడారు. 2017 వరకు ఈ జంట కలిసున్నారు. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ 9Salman khan) సోదరుడు అర్భాజ్ ఖాన్ (Arbaaz khan marriage) రెండో పెళ్లి చేసుకున్నాడు. నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 1998లోనే నటి మలైకా అరోరాని వివాహమాడారు. 2017 వరకు ఈ జంట కలిసున్నారు. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. మలైకా ప్రస్తుతం హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. అర్బాజ్ కూడా మరో తోడు చూసుకున్నాడు. నటి జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లగా ప్రేమలో ఉండి విడిపోయారు. కొన్ని నెలల క్రితం అర్భజ్‌ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారని టాక్ నడిచింది. కానీ వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఆదివారం రాత్రి వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఈ వివాహం చేసుకున్నారు.
అయితే అర్భజ్‌ఖాన్ , జియార్జియాని పెళ్లి చేసుకున్నాడా లేదా అయితే పెళ్లి నిజమా కాదా? అని అందరూ అనుకున్నారు. తాజాగా ముంబయిలోని తన సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో అర్బాజ్, మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్(shura khan)తో నిఖా చేసుకున్నాడు. ఈ వేడుకకు సల్మాన్ కుటుంబ స్ఘభ్యులు, పలువురు, సన్పిహితులు మాత్రమే హాజరయ్యారు. అర్బాజ్ పెళ్లిలో అతడి కొడుకు కూడా కనిపించడం గమనార్హం. ఈ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి ఆశీర్వదం కావాలని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో నటుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేసిన అర్భాజ్.. తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవ’ సినిమాతో ప్రతినాయకుడిగా కనిపించాడు. 2017లో రాజ్ తరుణ్ ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంలోనూ నటించాడు. ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.