Anil Sharma : బాలీవుడ్‌లో ఆ పాత్ర చేయగలిగేవారు లేరు

ABN , First Publish Date - 2023-09-03T17:51:52+05:30 IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ‘గదర్‌’ చిత్రంలో తారాసింగ్‌ పాత్రకు ఏ ఆర్టిస్ట్‌ సరిపోతారనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలరని ఆయన తెలిపారు.

Anil Sharma : బాలీవుడ్‌లో ఆ పాత్ర చేయగలిగేవారు లేరు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ (Anil Sharma) ప్రశంసల వర్షం కురిపించారు. ‘గదర్‌’ (gadar 2) చిత్రంలో తారాసింగ్‌ పాత్రకు ఏ ఆర్టిస్ట్‌ సరిపోతారనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలరని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గదర్‌’ చిత్రం తీస్తే తారాసింగ్‌ పాత్రకు ఎవరు సరిపోతారనే ప్రశ్నకు అనిల్‌ శర్మ ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ఈ తరం వాళ్లతో ‘గదర్‌’ చిత్రం చేయాలంటే తారాసింగ్‌ పాత్రకు సరిపడే హీరోలు ఈతరం వారు నాకు ఎవరూ కనిపించడం లేదు. బాలీవుడ్‌లో లేరు కానీ... దక్షిణాది హీరోలు ఉన్నారు. జూ.ఎన్టీఆర్‌ అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలరని నా నమ్మకం’ అని చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో ‘గదర్‌ 3’ ప్రస్తావన కూడా వచ్చింది. అయితే దీనిపై అనిల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ఇప్పటి దాకా అసలు ఆ చర్చ కూడా జరగలేదు అని తెలిపారు. (Tarak Suitable for Tarasingh)

బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మకు సీరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ చిత్రాలను బాగా తీయగలరనే పేరుంది. దర్శకత్వం వహించిన ‘గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’ 2001లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. ఇందులో సన్నీ దేఓల్‌.. తారాసింగ్‌ పాత్ర పోషించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా దాదాపు 22 ఏళ్ల తర్వాత అనిల్‌ ‘గదర్‌ 2’ తీశారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌సక్సెస్‌ అయింది. అంతే కాదు.. రూ. 500 కోట్లు వసూళ్లు రాబట్టింది.

Updated Date - 2023-09-03T17:51:52+05:30 IST