Rashmika Mandanna: రష్మిక నకిలీ వీడియో పెట్టిన వాళ్ళమీద చర్యలకై అమితాబ్ బచ్చన్
ABN , First Publish Date - 2023-11-06T11:49:15+05:30 IST
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నల్లటి డ్రెస్ లో లిఫ్టులోకి వెళుతున్న వీడియో ఒకటి ఈమధ్య వైరల్ అయింది. అయితే అది నకిలీ వీడియో అని, ఇలాంటి నకిలీ వీడియోలు పెట్టేవాళ్ళమీద న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ తన సంఘీభావాన్ని తెలిపారు.
'పుష్ప' #Pushpa సినిమాతో జాతీయంగా పేరు సంపాదించిన రష్మిక మందన్న (RashmikaMandanna) ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'యానిమల్' #Animal అనే సినిమాలో రణబీర్ కపూర్ (RanbirKapoor) పక్కన చేస్తోంది, ఆ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్ధంగా వుంది. రష్మిక మందన్న ఒక్కసారిగా ప్రాముఖ్యం చెంది 'నేషనల్ క్రష్' #NationalCrush అనే పేరుతో కూడా పిలవబడుతూ ఉంటుంది. అయితే ఈమధ్య రష్మిక మందన్న వీడియో ఒకటి వైరల్ అయింది సాంఘీక మాధ్యమంలో.
అందులో రష్మిక మందన్న ఒక నలుపు అవుట్ ఫిట్ లో లిఫ్ట్ లో వస్తున్నట్టుగా వున్న వీడియో బాగా వైరల్ అయింది. కానీ తరువాత తేలింది ఏంటంటే, అది నకిలీ వీడియో అని. బ్రిటిష్ కి చెందిన జర పటేల్ (Zara Patel) అనే ఆమె అదే అవుట్ ఫిట్ లో లిఫ్ట్ లోకి వెళ్లే వీడియో తన ఇన్స్టాగ్రామ్ లో అక్టోబర్ 9 న పోస్ట్ చేసుకుంది.
ఇంకేముంది ఇప్పుడు సాంకేతిక అంతా చేతిలో పనే కదా, వెంటనే కొందరు ఆ వీడియోలో జర పటేల్ ( Zara Patel) మొహం తీసి, రష్మిక మొహం పెట్టేసారు. దానితో అందరూ అది రష్మిక మందన్న వీడియో అనుకున్నారు. తీరా చూస్తే అది నకిలీ అని అర్థం అయింది. మరి ఇలా నకిలీ వీడియోలు, ఫోటోలు సాంఘీక మాధ్యమంలో పెడుతూ ఉంటే దీనిని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని అభిషేక్ అనే జర్నలిస్ట్ ఈ రెండు వీడియోలను షేర్ చేసి పెడితే, దానికి బాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan) తన సంఘీభావం తెలిపారు.
ఇలాంటి వాటి మీద న్యాయపరమైన పోరాటం, అలాగే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆ జర్నలిస్ట్ అంటే, అమితాబ్ బచ్చన్ దానికి సంఘీభావం తెలుపుతూ, ఈ రెండు వీడియోలు సమాచారాన్ని కూడా తన సాంఘీక మాధ్యమం ద్వారా రీ పోస్ట్ చేశారు.