Alia Bhatt: ‘కెరీర్ పిక్‌లో ఉన్నప్పటికీ.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా’

ABN , First Publish Date - 2023-01-01T14:18:00+05:30 IST

బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ఆలియా భట్‌ (Alia Bhatt)కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.

Alia Bhatt: ‘కెరీర్ పిక్‌లో ఉన్నప్పటికీ.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా’
Alia Bhatt

బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ఆలియా భట్‌ (Alia Bhatt)కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది వరుసగా ‘గంగుభాయి కతియావాడి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలతో సూపర్‌హిట్స్ సాధించింది. ఈ భామ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఈ తరుణంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor)ని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఇదే ఏడాది ఈ జంటకి ‘రాహ’ (Raha) అనే కూతురు పుట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పెళ్లి, కూతురి గురించి ఆలియా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

alia-bhatt1.jpg

ఆ ఇంటర్వ్యూలో కెరీర్ (Career) పిక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని.. తల్లి అయ్యారు కదా.. మీ సినీ జీవితం గురించి భయం వేయలేదా అని హోస్ట్ అడిగారు. దానికి ఆలియా సమాధానం ఇస్తూ.. ‘అవును.. నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే, నేను పెళ్లి చేసుకోవాలని, ఒక బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాను. కానీ పెళ్లి లేదా మాతృత్వం నా కెరీర్‌కి డ్యామేజ్ చేస్తుందని ఎవరూ చెప్పారు?. కానీ పెళ్లి తర్వాత కూడా ఏం మార్పు ఉండదు. అందుకే దాని గురించి పట్టించుకోకుండా అనుకున్నది చేసేశా. నిజానికి నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం’ అని చెప్పుకొచ్చింది.

aliab.jpg

Updated Date - 2023-01-01T14:18:06+05:30 IST