Gumraah: మొత్తానికి ఈ సౌత్ మూవీని చెడగొట్టలేదు.. ఈ చిత్రానికి ప్లస్‌లేంటంటే..

ABN , First Publish Date - 2023-04-07T13:36:45+05:30 IST

ఓ భాషల్లో విడుదలై సూపర్ హిటైన చిత్రాన్ని రిమేక్ చేయడం ఎప్పటి నుంచో వస్తుందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు అలా రిమేక్ అయ్యాయి.

Gumraah: మొత్తానికి ఈ సౌత్ మూవీని చెడగొట్టలేదు.. ఈ చిత్రానికి ప్లస్‌లేంటంటే..
Mrunal Thakur

ఓ భాషల్లో విడుదలై సూపర్ హిటైన చిత్రాన్ని రిమేక్ చేయడం ఎప్పటి నుంచో వస్తుందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు అలా రిమేక్ అయ్యాయి. అయితే అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ఆకట్టుకోగా.. చాలా సినిమాలు ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోయాయి. ఇటీవలికాలంలో సౌత్ భాషల్లో హిట్ సినిమాలను వరుసగా బాలీవుడ్ స్టార్స్ రిమేక్ చేస్తున్నారు. అయితే.. అందులో దాదాపు అన్ని బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అలా ఈ ఏడాది ‘షాహజాదా’గా రిమేక్ అయిన ‘అల వైకుంఠపురములో’, ‘భోళా’గా ‘ఖైదీ’, అలాగే.. సెల్ఫీ వంటి సౌత్‌లో సూపర్ హిట్ అయిన పలు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకుల తిరస్కరణకు గురయ్యాయి. దీంతో నెట్టింట ఎంతోమంది దక్షిణాది సినీ లవర్స్ మంచి సినిమాలను చెడగొట్టడమే మీ పనా అంటూ ట్రోలింగ్ చేశారు. అయితే.. తాజాగా ఓ సినిమాని మాత్రం బాలీవుడ్ సక్సెస్‌ఫుల్‌గా రిమేక్ చేయగలిగింది. (Gumraah Movie Review)

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ (Red) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ డ్యూయెల్ రోల్ పోషించాడు. నిజానికి ఇది తమిళ యువ నటుడు అరుణ్ విజయ్ నటించిన చిత్రం ‘తడం’ (Thadam)కి ఇది రిమేక్. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘గుమ్రా’ అనే పేరుతో రిమేక్ చేశారు. ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur) ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ పోషించగా.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కీలకమైన పోలీసాఫీసర్ పాత్రని పోషించింది.

Mrunal.jpg

Read Also:

Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

మొదట ఈ రిమేక్ గురించి ప్రకటించినప్పుడు ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్ చెడగొడుతుందని సౌత్ ప్రేక్షకులు సందేహించారు. అయితే.. ఈసారి వారు అలాంటి పొరపాటు ఏం చేయలేదు. నేడు (ఏప్రిల్ 7) విడుదలైన ‘గుమ్రా’ మూవీకి ఎక్కడ చూసిన పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఎమోషన్స్‌, సస్పెన్స్‌‌తో సరదా సన్నీవేశాలతో ప్రేక్షకులకి ఇంట్రస్ట్‌ కలిగించారని రివ్యూలలో రాసుకొస్తున్నారు. దీంతో ‘ఈ సారి ఓ మంచి సినిమాని చెడగొట్టకుండా బాలీవుడ్ బతికించింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (#MrunalThakur)

కథేంటంటే..

ఓ వర్షం కురిసిన రాత్రి ఓ ఇంట్లో ఓ వ్యక్తి మర్డర్ జరుగుతుంది. ఆ కేసు విచారించే బాధ్యతని ఉన్నతాధికారులు ఓ మహిళ పోలీసుకి అప్పగిస్తారు. అప్పుడు ఆమెకి ఓ వ్యక్తి మీద అనుమానం వస్తుంది. అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. అతని ఓ కవల సోదరుడు ఉన్నాడనే విషయం తెలుస్తుంది. దీంతో కేసు మరింత కాంప్లికేటేడ్ అవుతుంది. దీంతో ఒకే మర్డర్‌‌కి ఇద్దరు అనుమానితులు ఉంటారు. ఇన్ని సమస్యల మధ్య అసలు హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేది ఈ చిత్ర కథాంశం.

ఇవి కూడా చదవండి:

War 2: బాలీవుడ్ మూవీలో విలన్‌గా ఎన్టీఆర్!?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-07T13:49:59+05:30 IST