Mouni Roy: ఆయనే తోడుగా నిలిచాడు... సిబ్బందికి ధన్యవాదాలు

ABN , First Publish Date - 2023-07-23T13:24:00+05:30 IST

టీవీ నటిగా కెరీర్‌ ప్రారంచి ప్రత్యేక గీతాలతో సినిమా అవకాశాలు అందుకున్నారు మౌనీ రాయ్‌. నాగిని’ సీరియల్‌తో విడుదలైన అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకుంది. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నాయికగా నటించారు. తాజాగా మౌనీరాయ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నట్లు అక్కడి ఫొటోలను షేర్‌ చేసింది.

Mouni Roy: ఆయనే తోడుగా నిలిచాడు... సిబ్బందికి ధన్యవాదాలు

టీవీ నటిగా కెరీర్‌ ప్రారంచి ప్రత్యేక గీతాలతో సినిమా అవకాశాలు అందుకున్నారు మౌనీ రాయ్‌((moun rou). 'నాగిని’ (nagini) సీరియల్‌తో విడుదలైన అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకుంది. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నాయికగా నటించారు. తదుపరి ‘కేజీఎఫ్‌-1’ (KGF1)ఓ ప్రత్యేక గీతంలో దక్షిణాదికి పరిచయమయ్యారు. బ్రహ్మాస్త్ర-1: శివ’ చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ ఆకర్షించింది. తాజాగా మౌనీరాయ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నట్లు అక్కడి ఫొటోలను షేర్‌ చేసింది. Mouni roy Hospitalized)

‘‘అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. 9 రోజుల చికిత్స అనంతరం శనివారం ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్నని రోజులు ఎంతో బాధ అనువించాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇన్ని రోజులు నన్నెంతో జాగ్రత్తగా చూసుకున్న ఆస్పత్ని సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నా’’ అని పేర్కొంది. చికిత్స సమయంలో తన భర్త సూరజ్‌ నంబీయార్‌ ఎంతో తోడుగా నిలిచాడని తెలిపింది. జీవితమంతా అతనికి రుణపడి ఉంటానని చెప్పింది. అయితే తను ఏ సమస్యతో ఆస్పత్రి పాలైందో మౌనీ చెప్పలేదు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌, దిశా పటానీ ‘ఏమైంది బేబీ.. నువ్వు త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-23T14:28:02+05:30 IST