Animal: ఇదేం వాడకం నాయనా.. అంతకుమించి యానిమల్ మిషన్ గన్!
ABN , First Publish Date - 2023-11-30T18:21:41+05:30 IST
రణబీర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్. ఇప్పటికే విడుదలైన పాటలు, టీలజ్,ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ స్థాయిలో పెంచగా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్ర ట్రైలర్‌లో కనిపించిన మిషన్ గన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది న్యూస్ అయింది.
రణబీర్ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్ (Animal). ఇప్పటికే విడుదలైన పాటలు, టీలజ్,ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ స్థాయిలో పెంచగా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్ర ట్రైలర్‌లో కనిపించిన మిషన్ గన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది న్యూస్ అయింది. లోకేశ్ కనగరాజ్ ఎలా అలోచించాడో గానీ సినిమాలో ఎదో ఓ ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడా లేక సినిమా గురించి మాట్లాడాలనుకున్నాడేమో గానీ ఖైదీ సినిమా క్లైమాక్స్‌లో వాడిన గన్ ఇంఫాక్ట్ సౌత్ ఇండస్ట్రీనీ వీడడం లేదు. అది మొదలు చాలా సినిమాలలో అలాంటి సీన్లను లేకుంటే అంతకుమించిన గన్నులను వాడుతూ పోతున్నారు.
ఖైదీ తర్వాత వచ్చిన కేజీఎఫ్, లోకేశ్ దర్శకత్వం వహించిన విక్రమ్, చిరంజీవి వాల్తేర్ వీరయ్య, విశాల్, మార్క్ అంటోని సినిమాల్లో రకరకాల గన్నులు వాడి ప్రేక్షకులకు సూపర్ ఎక్స్‌పీరియన్స్ అందించారు. గన్నులలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని జనాలనుకునేలా ఒకదాన్ని మించి మరోటి అన్న చందంగా గన్నులను వాడేసి విజయాలు సాధించారు. ఆలా గన్నుల వాడకంపై అనిల్ రావిపూడి తాజా చిత్రం భగవంత్ కేసరిలో సెటైర్స్ వేశారు. ఇప్పుడు గన్నుల ట్రెండ్ నడుస్తున్నది. నా నుంచి అభిమానులు ఇంకా ఎక్కువ కోరుకుంటారంటూ గ్యాస్ పిలిండర్లను పేలుస్తాడు. కాగా ఇప్పుడు యానిమల్ సినిమాలోనూ దానమ్మ మొగుడు అన్న రీతిలో ఓ మరింత ఆడ్వాన్స్‌డ్ గన్నును చూయించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగా.. దాదాపు ఈ గన్ ఫైటింగ్ 15 నిమిషాలు ఉంటుందని సమాచారం.
అయితే ఈ సీన్ చూసిన చాలా మంది ప్రేక్షకులు అది వీఎఫ్ఎక్స్ లో తీశారని అనుకున్నారు. కానీ అది ఒరిజినల్ అని దానిని 500 కేజీల ప్యూర్ సిల్వర్‌తో నాలుగు నెలల పాటు కష్టపడి నిజంగా తయారు చేసిందని, దాని కోసం దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు ఆర్ట్ డైరెక్టర్ సెల్వరాజన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పగా హీరో రణబీర్ (Ranbir Kapoor) కూడా అది వాస్తవమేనంటూ చెప్పడమే కాకుండా సందీప్ ఆ సన్నివేశం గురించి చెప్పినప్పుడు, చిత్రీకరించినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఫీలయ్యానని ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుందని అన్నారు.
కాగా యానిమల్ (Animal ) సినిమాలో వాడిన మిషన్ గన్ ప్రస్తుతం ముంబయ్‌లో ఉండగా త్వరలో హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడి సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. ఇక్కడ కొద్ది రోజులు ఉంచాక ప్రత్యేక ట్రాన్స్‌ఫోర్ట్‌లో దేశంలోని ఇతర నగరాలకు కూడా తరలిస్తామని, దీని ద్వారా సినిమాకు డబల్ ప్రమోషన్ జరిగే అవకాశం ఉంటుందని మేకర్స్ బావిస్తున్నారు. ఇదిలాఉండగా సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ నభూతో అన్న రీతిలో ఉండనున్నట్లు సమాచారం. 3గంటల 21 నిమిషాల నిడివితో వస్తున్న సినిమాలో దాదాపు ఆర గంటకు పైగా యాక్షన్ సన్నివేశాలు, మిగతాదంతా హర్డ్ ఎమోషనల్ ప్యామిలీ డ్రామా నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.