18 Pages: విడుదలైన విచిత్రమైన లవ్ స్టోరీలోని పాట
ABN , First Publish Date - 2022-12-12T21:31:45+05:30 IST
‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరోహీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం
‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరోహీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘18 Pages’. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం చిత్రంలోని ‘ఏడు రంగుల వాన’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ కథని అందించారు. ఇక తాజాగా విడుదలైన ‘ఏడు రంగుల పాట’కు గోపీసుందర్ స్వరాలు సమకూర్చగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. టాలెంటెడ్ సింగర్ సిధ్ శ్రీరామ్ అలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాట లాంఛ్ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్‌లో డైరెక్షన్ చేయడం బిగ్ హానర్‌గా భావిస్తున్నాను. నా గురువు సుకుమార్‌గారు మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చేద్దాం అన్నారు. అన్నట్టు తను మ్యూజిక్‌లో నుండే కథను తయారు చేశారు. ఇందులో నిఖిల్, అనుపమలు స్టార్స్ అనే ఫీలింగ్ లేకుండా చాలా న్యాచురల్‌గా నటించారు. బన్నీ వాసు, అరవింద్‌గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. గోపి గారు మ్యూజిక్‌లో ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన పాటను అరవింద్‌గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ నెల 23న వస్తున్న మా చిత్రాన్ని బిగ్ హిట్ చేయాలని కోరుతున్నానని తెలపగా.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకులు సూర్య ప్రతాప్‌గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు.. కథపై ఎటువంటి ఫీల్ కలిగిందో ఇప్పుడు ఆ ఫీలింగ్ డబులైంది. ఇందులో నందిని క్యారెక్టర్‌లో నటించడం జరిగింది. అందరూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉందని అంటుంటే.. చాలా హ్యాపీ అనిపించింది. ‘కార్తికేయ2’ తరువాత నిఖిల్‌తో మళ్ళీ చేయడం చాలా సంతోషంగా ఉంది. గోపి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
లిరిసిస్ట్ శ్రీమణి మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్‌లో వచ్చిన 100 పర్సంట్ లవ్‌తో నా జర్నీ మొదలైంది. ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఈ సినిమాకు మూడు పాటలు రాసే అవకాశం ఇవ్వడంతో నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట కూడా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలపగా.. సంగీత దర్శకుడు గోపి సుందర్ మాట్లాడుతూ.. ఈ బ్యానర్‌లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న ఈ చిత్రం కూడా మ్యూజికల్‌గా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.