Anasuya: సిల్వర్ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టం
ABN , First Publish Date - 2022-12-22T12:35:08+05:30 IST
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారు. నేను కూడా బంగారం కన్నా ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీనే ఇష్టపడ్డతానని అన్నారు అనసూయ.

నేను బంగారం కంటే ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీని ఇష్టపడతాను అన్నారు యాంకర్, నటి అనసూయ (Anasuya). ఫ్యాషన్ జ్యువెలరీ విభాగమైన నీలియాస్ ఎక్స్‌క్లూజివ్ 925 వెండి ఆభరణాల స్టోర్‌ని (Neelias Exclusive 925 Silver Jewellery Store) బుధవారం హైదరాబాద్ మాదాపూర్‌లో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో నీలియాస్ తన ప్రత్యేకమైన ఆభరణాల స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారు. నేను కూడా బంగారం కన్నా ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీనే ఇష్టపడతాను. మగవల మనసుకు నచ్చే అనేక ఉత్పత్తులు, డిజైన్లు ఇక్కడ తేలికగా ఎంపిక చేసుకోవచ్చన్నారు. సంప్రదాయ ఆభరణాలకు సరికొత్త మేళవింపుతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రతి ఒక్క మగువ ఈ స్టోర్‌ని తప్పకుండా సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు.
స్టోర్ నిర్వాహకురాలు వినీత (Vineetha) మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని నీలియాస్ ఎక్స్‌క్లూజివ్ 925 జ్యువెలరీ స్టోర్ స్థాపించాను. ఇక్కడ కుందన్, జిర్కన్, టెంపుల్, కాంటెంపరరీలతోపాటు పురాతన, ప్రత్యేకమైన ఆభరణాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. హైదరాబాద్ వాసులు ఫ్యాషన్‌కి పెద్ద పీట వేస్తారని, అందులో భాగంగానే ఈ స్టోర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తొలిసారిగా పిల్లల కోసం ప్రత్యేక జ్యువెలరీ కలెక్షన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా ఆమె వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వశిష్ట, ఫ్యాషన్స్ స్టైలిస్ట్ ప్రీతం జుక్కల్కర్, సినీనటులు నందిని రాయ్, కామాక్షి భాస్కర్ల, పాయల్ రాధాకృష్ణ, హర్షిత చౌదరి, రాశి సింగ్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాలతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు.