Vallabhaneni Janardhan: ‘గ్యాంగ్‌లీడర్’ ఎస్.పి ఇకలేరు!
ABN , First Publish Date - 2022-12-29T11:56:01+05:30 IST
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శక నిర్మాత వల్లభనేని జనార్దన్ (63)కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పతిల్రో చికిత్స పొందురూ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శక నిర్మాత వల్లభనేని జనార్దన్ (63)కన్నుమూశారు(Vallabhaneni Janardhan). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పతిల్రో చికిత్స పొందురూ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు(Vallabhaneni Janardhan passed away). ఏలూరు సమీప ప్రాంతం పోతునూరులో జనార్దన్ 1959 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే మరణించింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు. కుమారుడు అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. విజయబాపినీడు మూడవ కూతురు లలిని చౌదరిని జనార్దన్ వివాహమాడారు. జనార్దన్‌కు సినిమాలపై ఉన్న ఆసక్తితో కెరీర్ బిగినింగ్‌లోనే సొంత బ్యానర్ స్థాపించి ‘మామ్మగారి మనవలు’ చిత్రం మొదలుపెట్టారు. ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కన్నడ హిట్ సినిమా ‘మానససరోవర్’ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా ‘అమాయక చక్రవర్తి’ (Amayaka chakravarthi)సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత శోభన్ బాబు హీరోగా హిందీ ‘బేసరా’ను ‘తోడు-నీడ’గా తెలుగులో రీమేక్ చేశారు. తన కుమార్తె శ్వేత పేరుమీద శ్వేత ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి ‘శ్రీమతి కావాలి’, ‘పారిపోయిన ఖైదీలు’ చిత్రాలను రూపొందించారు. ‘శ్రీమతి కావాలి’ టైమ్‌లో అనుకున్న ఆర్టిస్ట్ రాకపోవడంతో తానే నటుడుగా మారారు జనార్థన్. తన మామ విజయబాపినీడుతో కలిసి ‘మహాజనానికి మరదలు పిల్ల’ చిత్రాన్ని తెరకెక్కించారు. రవితేజను(Ravi teja) హీరోగా నిలిపిన శ్రీను వైట్ల మొదటి సినిమా ‘నీ కోసం(neekosaM)’కు నిర్మాణ సారథ్యం వహించారు.
విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాల్లో వల్లభనేని జనార్దన్ నటునిగా రాణించారు. చిరంజీవితో బాపినీడు తెరకెక్కించిన సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’లో సుమలత తండ్రి, ఎస్.పిగా నెగటివ్ పాత్రలో నటించి మెప్పించారు. వందకు పైగా చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించారు. ఆయనకు సినిమాపై ఉన్న అభిమానంతో ఏ పాత్ర వచ్చిన కాదనకుండా చేసేవారు. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్దన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’లోనూ, నాగార్జునతో ‘వారసుడు’లోనూ, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీయస్’లోనూ స్ర్కీన్ షేర్ చేశారు. టీవీ సీరియళ్లల్లోనూ మెప్పించారు. వల్లభనేని జనార్దన్ మరణవార్తతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది.