2022 Tollywood heros: రెండు మూడు ప్రయత్నాలు.. రిజల్ట్ మాత్రం!
ABN , First Publish Date - 2022-12-27T19:04:45+05:30 IST
ఒక్కప్పుడు స్టార్ హీరోల నుంచి ఏడాది రెండు మూడు సినిమాలు వచ్చేవి. ఇది కొన్నేళ్ల క్రితం మాట. ఇప్పుడు స్టార్ హీరో నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తే గ్రేట్ అన్నట్లు ఉంది పరిస్థితి.
ఒక్కప్పుడు స్టార్ హీరోల (Tollywood stars)నుంచి ఏడాది రెండు మూడు సినిమాలు వచ్చేవి. ఇది కొన్నేళ్ల క్రితం మాట. ఇప్పుడు స్టార్ హీరో నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తే గ్రేట్ అన్నట్లు ఉంది పరిస్థితి. జరిగేది కూడా అదే. అతి కష్టంగా ఏడాదికి ఓ సినిమా వస్తుంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని హీరోలకు ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వీలుపడట్లేదు. అయితే ఈ ఏడాది విచిత్రంగా రెండు మూడు సినిమాలతో థియేటర్‌లలో సందడి చేశారు పలువురు టాలీవుడ్ స్టార్లు. ఆ సంగతులేంటో చూద్దాం. (2022year ending stories)
చిరు రెండు.. నాగ్ మూడు... కానీ(Chiranjeevi-Nagarjuna)
2021లో ‘వైల్డ్ డాగ్’ సినిమాతో సరిపెట్టుకున్న అక్కినేని నాగార్జున ఈ ఏడాదిమూడు సినిమాల్లో కనిపించారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంగార్రాజు’ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. తెలుగువారి పెద్ద పండుగకు మరింత సందడి తీసుకొచ్చింది. (raviteja)ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున్ నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా దసరా కానుకగా విడుదలైంది. బాలీవుడ్‌లో ‘బ్రహాస్త్ర’లో కీలక పాత్రతో మెప్పించారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం చిరంజీవి సినిమాకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కరోనా వల్ల షూటింగ్ జాప్యం జరగడం వల్ల ఆయన నుంచి రావలసిన ఆచార్య ఆలస్యమైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించిన ‘ఆచార్య’ భారీ అంచనాల మధ్య ఈ ఏడాది విడుదలైంది. అయితే ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మోహన్‌రాజా డైరెక్షన్‌లో వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. (telugu Film news)
వెంకీ - వరుణ్ ఫన్ - రవితేజ ధమాకా(Venkatesh)
ఈ ఏడాది వెంకటేశ్ ‘ఎఫ్3’తో అలరించారు. ఇటీవల విడుదలైన ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్‌లో మెరిశారు. ంచి మెప్పించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమా హీరో రవితేజ. ఆయన నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ నెల 23న విడుదలైన ‘ధమాకా’ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమిది. రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఖిలాడి’, శరత్ మండవ తెరకెక్కించిన ‘రామారావు: ఆన్ డ్యూటీ’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
నెక్ట్స్ జనరేషన్‌ల హీరోల హవా
కరోనాకు ముందు విడుదలైన ‘వినయ విధేయ రామ’ సినిమా రామ్ చరణ్‌కు సరైన విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వేసవిలో విడుదలై రికార్డులు సృష్టించింది. ఎన్టీఆర్‌తో కలిసి చరణ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించి తెలుగు సినిమా స్థాయినని పెంచింది. తన తండ్రి చిరంజీవితో కలిసి చరణ్ నటించిన ‘ఆచార్య’.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. గతేడాది లవ్‌స్టోరి’తో హిట్ అందుకున్న నాగ చైతన్య 2022లో ‘బంగార్రాజు’తో అభిమానుల్ని బాగా అలరించారు. తదుపరి విక్రమ్. కె. కుమార్ రూపొందించిన ‘థ్యాంక్యూ’ పరాజయాన్ని చవిచూసింది. దీని తర్వా ‘లాల్‌సింగ్ చడ్డా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు చై. ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వెత్ చందన్ తెరకెక్కించిన ఈ సినిమాలో చైతన్య కీలక పాత్ర పోషించారు. తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ చిత్రం పరాజయాన్ని చూసింది. రానా విలన్‌గా నటించిన ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకులను అలరించింది. పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన చిత్రమిది. తదుపరి వేణు ఊడుగుల రూపొందించిన ‘విరాటపర్వం’ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘1945’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఒకటి కాకపోయినా మరొకటి...
కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ నటించిన ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. శ్రీ కార్తిక్ తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ శర్వాకు మంచి గుర్తింపు తెచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 3’ హిట్టైంది. సక్సెస్‌ఫుల్ చిత్రం ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ కూడా నటించారు. ఈ చిత్రానికి ముందు వరుణ్‌తో కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘గని’ సక్సెస్ కాలేదు. విశ్వక్ ేసన్ హీరోగా విద్యాసాగర్ చింతా తెరకెక్కించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా విశ్వక్‌లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఇటీవల విడుదలైన ‘ఓరి దేవుడా’ కూడా ఓకే అనిపించింది. ‘మేజర్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అంతటా మంచి స్పందన దక్కించుకుంది. ఆయన నటించిన ‘హిట్ 2’ కూడా మంచి విజయం అందుకుంది. శైలేష్ కొలను దర్శకుడు. నిఖిల్ నటించిన తొలి ప్యాన్ ఇండియా సినిమా ‘కార్తికేయ 2’. చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ మెప్పించింది. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ నటిచిఇన ‘18 పేజేస్’ ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం ఆడకపోయినా చిరంజీవితో నటించిన ‘గాఢ్ ఫాదర్’తో ఆయనకు గొప్ప పేరొచ్చింది.
అంతంత మాత్రమే...
యువ హీరోల శ్రీవిష్ణు, ఆది, కిరణ్ అబ్బవరం నటించిన చిత్రాలు అంతంత మాత్రంగానే నడిచాయి. శ్రీవిష్ణు ‘భళా తందనాన’, ‘అల్లరి’, ఆది సాయికుమార్ ‘అతిథి దేవోభవ’, ‘తీస్ మార్ ఖాన్’, ‘బ్లాక్’, ‘క్రేజీ ఫెలో’ చిత్రాలు కూడా ఆకట్టుకోలేదు. కిరణ్ అబ్బవరం సెబాస్టియన్’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.