Sunny leone: అప్పట్లో నన్ను బెదిరించారు
ABN , First Publish Date - 2022-12-26T14:46:58+05:30 IST
పీఎస్‌వీ గరుడవేగ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించిన సన్నీలియోన్ ‘జిన్నా’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే! తాజాగా ఓ తమిళ చిత్రం ప్రచారాల్లో పాల్గొన్న సన్నీ గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చి భావోద్వేగానికి లోనయ్యారు.
పీఎస్‌వీ గరుడవేగ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించిన సన్నీలియోన్ (Sunny leone)‘జిన్నా’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే! తాజాగా ఓ తమిళ చిత్రం ప్రచారాల్లో పాల్గొన్న సన్నీ గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. సినీరంగంలో అడుగుపెట్టిన కొత్తలో చాలా బెదిరింపులు (Death threats)వచ్చేవనీ, అసలు భారత్‌లో అడుగుపెడతానని అనుకోలేదని ఆమె చెప్పారు. ‘‘కెరీర్ బిగినింగ్‌లో ఓ ప్రముఖ టీవీ షోలో కనిపించాను. అప్పుడు నాకు బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. చంపేస్తామంటూ కొందరు సందేశాలు పంపేవారు. వాటిలో ఎక్కువ భారత్ నుంచి వచ్చినవే! దాంతో ఇక్కడి ప్రజలు నాపై కోపంగా ఉన్నారని అర్థమైంది. ఆ బెదిరింపులు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు 20 ఏళ్లు ఆ టైమ్‌లో నాకు ఇది మంచి, ఇది చెడు అని ఎవరూ చెప్పలేదు. చెప్పేవారు కూడా నాకు ఎవరూ లేరు. అదే సిచ్చుయేషన్ ఇప్పుడు ఎదురైతే నేను అంతగా ఎఫెక్ట్ కాను. ఇప్పుడు నేను మానసికంగా బలంగా తయారయ్యా’’ అని అన్నారు. (Tollywood)