Narthan: రామ్ చరణ్‌తో సినిమా చేయనున్న నర్తన్!
ABN , First Publish Date - 2022-12-26T18:03:12+05:30 IST
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). రంగస్థలం సినిమాతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు.
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). రంగస్థలం సినిమాతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సీ 15’ (RC15)లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నెలలో సగం రోజులు మాత్రమే ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుంది. అందువల్ల కొత్తగా కథలు వింటున్నాడు. ఈ మధ్యనే బుచ్చి బాబు సానా దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఒకే చేసే పనిలో పడ్డాడు.
యువి క్రియేషన్స్‌తో రామ్ చరణ్ ఓ సినిమా చేయాలి. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తాడని గతంలో ప్రకటన కూడా ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అమాంతం క్రేజ్ మారడంతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. కానీ, యువి క్రియేషన్స్ మాత్రం చెర్రీ కోసం కొత్తగా కథలు వింటుంది. అయితే, యువి సంస్థ కన్నడ డైరెక్టర్ నర్తన్ (Narthan), రామ్ చరణ్ కాంబినేషన్‌లో మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. నర్తన్ ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. నర్తన్ గతంలోనే రామ్ చరణ్‌కు స్టోరీని వినిపించాడు. ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్టు మాత్రం మెటీరియలైజ్ కాలేదు. కాగా, రామ్ చరణ్‌కు గతంలోనే చెప్పిన కథకు నర్తన్ మెరుగులు దిద్దుతున్నాడా?లేదా మరేదైనా కొత్త స్టోరీని సిద్ధం చేస్తున్నాడా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.