Rakul Preet Singh: శాంతా ఇచ్చిన గొప్ప వరం నువ్వు .. త్వరలో పెళ్లి

ABN , First Publish Date - 2022-12-27T14:57:17+05:30 IST

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి బహిరంగంగా వెల్లడించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Rakul Preet Singh: శాంతా ఇచ్చిన గొప్ప వరం నువ్వు .. త్వరలో పెళ్లి

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul preeth singh), తన బాయ్‌ఫ్రెండ్‌ జాకీ బద్నాని గురించి బహిరంగంగా వెల్లడించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి రకుల్‌ కూడా ‘యెస్‌’ అన్నటే సమాధానమిచ్చారు. గత పుట్టినరోజున ఇద్దరూ కలిసి సెలబ్రేట్‌ చేసుకున్న ఫొటోలతో మరోసారి వారి మధ్య ఉన్న ప్రేమ గురించి బహిరంగంగా వెల్లడించింది. జాకీ బద్నాని పుట్టినరోజును, క్రిస్మస్‌ వేడుకను రకుల్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. అంతేకాదు జాకీ తనకు దొరకడం గొప్ప వరమని పేర్కొంది. ‘‘నా జీవితానికి శాంతా ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌ జాకీ. చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే మై లవ్‌. ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని, మీరు కోరుకన్నవన్నీ జరగాలని ఆశిస్తున్నాను’’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ జంట వచ్చే ఏడాది వివాహబంధంతో ఒకటి కానున్నరని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం రకుల్‌కు తెలుగులో సినిమాలేమీ లేవు. బాలీవుడ్‌ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌ సరసన నటిస్తున్న ‘అయలాన్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్థమవుతోంది. అలాగే కమల్‌హాసన్‌ సరసన ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - 2022-12-27T14:58:04+05:30 IST