Puri Jagannadh: అమ్మ ఎంత బాధ పడుతుందో ఆలోచించు.. అది నాన్న కష్టమని తెలుసుకో!
ABN , First Publish Date - 2022-12-20T18:26:36+05:30 IST
పూరి జగన్నాథ్ మ్యూజింగ్‌లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొంతగ్యాప్ ఇచ్చిన ఆయన రోజుకో మ్యూజింగ్ చేస్తున్నారు. తాజాగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడారు. వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుంది.
పూరి జగన్నాథ్ మ్యూజింగ్‌లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొంతగ్యాప్ ఇచ్చిన ఆయన రోజుకో మ్యూజింగ్ చేస్తున్నారు. తాజాగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడారు. వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే తపన ఉంటుంది. దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని పూరి అన్నారు. యువత ఆలోచనలను పక్కదోవ పట్టించేవాళ్లు చాలామంది ఉంటారు. వారితో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు.
‘‘యూత్.. వయసులో ఉన్న యువతరం మీరు. ఈ వయసులో మీ రక్తం ఎగసిపడుతుంటుంది. మీ మజిల్స్. విజిల్స్ వేస్తుంటాయి. కాళ్లల్లో విపరీతమైన బలం ఉంటుంది. ఒకచోట కూర్చోవాలనిపించదు. నిద్ర రాదు. ఎప్పుడూ హైపర్‌గా ఉంటారు. వద్దన్న పనే చేస్తారు. భయం తెలీదు. ఫ్యూచర్ గురించి బాధ ఉండదు. మీ వయసులో ఉన్న యువతరమే మేథావులకు కావలసింది. కానీ, చాలా మంది యువతను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తారు. మాటలతో నమ్మిస్తారు. మీతో ధర్నాలు, ఉద్యమాలు చేయిస్తారు. ప్రతిదానికి యూత్ కావాలి. గుడిలో భజన చేసేది మీరే. పండగ?కు డాన్స్ చేేసది మీరే. సినిమా టికెట్స్ కోసం చొక్కలు చించుకునేది మీరే.. యుద్థంలో ముందుండే సైనికులు మీరే. ఆఖరికి సూసైడ్ బాంబర్స్ కూడా మీరే. ఈ వయసులో మీకు కావాల్సింది మీలో స్ఫూర్తినింపే వాళ్లు. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో మీకే తెలీదు. యూత్‌కోసం చాలా మంది మేథావులు మాట్లాడతారు. అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి. అయితే, స్ఫూర్తినింపడం వేరు, రెచ్చగొట్టడం వేరు. ఆ తేడా గమనించకపోతే చాలా తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఉసిగొలుపుతుంటారు. దయచేసి జీవితాలు నాశనం చేసుకోకండి. మీ అమ్మ నాన్నలు మీ గురించి ఎన్నో కలలు కంటారు. వాటిని వదిలేసి ఇంకెవరో కల కోసం బలి కావద్దు. మీరు జేజేలు, నినాదాలు చేస్తుంటే అవి ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. చొక్క చించుకున్నప్పుడు.. అది మీ నాన్న కష్టంతో కొన్నదని గుర్తుంచుకోండి. చెయ్యి కోసుకున్నప్పుడు.. మీ అమ్మకు తెలిేస్త ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి. యుక్త వయసులో భగత్‌సింగ్‌లా దేశం కోసం చేేస్త ఓకే. కానీ, ఇంకెవరి కోసమో అనవసరంగా చేేస్త మీ అంత మూర్ఖులు మరొకరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. మంచి నాయకులు ఉంటారు, చెడ్డ వాళ్లు కూడా ఉంటారు. మీలో స్ఫూర్తినింపే వాళ్లు ధైర్యం చెప్పి భుజం తడతారు. రెచ్చగొట్టే వాళ్లు అవీఇవీ చెప్పి ఉసిగొల్పుతారు. తస్మాత్ జాగ్రత్త’’ అని పూరి చెప్పారు.