Kushi Re Release: ఇయర్ ఎండింగ్ రోజు పవర్ స్టార్ ట్రీట్
ABN , First Publish Date - 2022-12-19T18:20:59+05:30 IST
టాలీవుడ్‌లో ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. దశాబ్దాల క్రితం అగ్ర హీరోలు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా రీ రిలీజ్ చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ‘పోకిరి’, ‘జల్సా’, ‘త్రీ’ సినిమాలను రీ రిలీజ్ చేయగా హిట్ అయ్యాయి.

టాలీవుడ్‌లో ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. దశాబ్దాల క్రితం అగ్ర హీరోలు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా రీ రిలీజ్ చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ‘పోకిరి’, ‘జల్సా’, ‘త్రీ’ సినిమాలను రీ రిలీజ్ చేయగా హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ‘జల్సా’ అయితే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘ఖుషి’ (Kushi). భూమిక హీరోయిన్‌గా నటించింది. యస్‌జె. సూర్య కథను రాసి దర్శకత్వం వహించాడు. ఎఎమ్. రత్నం నిర్మించాడు. ఈ చిత్రాన్ని రీ మాస్టరింగ్ చేసి 4కెలో డాల్బీ 5.1ఆడియోలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ రీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అనేక రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ అల్బమ్ కూడా సంచలన విజయం సాధించింది. మిస్సమ్మ సినిమాలోని ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ పాటను ఈ సినిమాలో రీమేక్ చేశారు.