Nayanatara: యువ కథానాయికకు సున్నితమైన చురకలు!
ABN , First Publish Date - 2022-12-22T18:21:58+05:30 IST
మలయాళ నటి మాళవిక మోహనన్‌కు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు నయనతార. గతంలో నయనతారకు సంబంధించి మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సూపర్‌స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఓ నటి ఆస్పత్రి సన్నివేశంలోనూ ఫుల్ మేకప్, లిప్‌స్టిక్, స్టైలిష్ హెయిర్‌స్టైల్, ఐ లైనర్ ఇలా అంతా గ్లామర్‌గా యాక్ట్ చేసింది.
malavika mohanan, nayan fire on malavika
మలయాళ నటి మాళవిక మోహనన్‌కు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు నయనతార(Nayanatara, ). గతంలో నయనతారకు సంబంధించి మాళవిక ( malavika mohanan)ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సూపర్‌స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఓ నటి ఆస్పత్రి సన్నివేశంలోనూ ఫుల్ మేకప్, లిప్‌స్టిక్, స్టైలిష్ హెయిర్‌స్టైల్, ఐ లైనర్ ఇలా అంతా గ్లామర్‌గా యాక్ట్ చేసింది. ఆ సీన్స్ చూసి నేను షాకయ్యా. ఎంత కమర్షియల్ సినిమా అయినా రియలిస్టిక్‌గా ఉండాలి కదా అనిపించింది’’ అని కామెంట్ చేసింది. ( nayan fire on malavika)దీనిపై తాజాగా తాను నటించిన ‘కనెక్ట్’ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార పేరు చెప్పకుండా సదరు హీరోయిన్‌కు చురకలు వేశాలు. ‘‘నేను దర్శకుల నటిని. దర్శకులు ఏం చెబితే అది చేయడం నా నైజం. సినిమాల్లో రియలెస్టిక్, కమర్షియల్ అనే వ్యత్యాసం ఉంటుంది. దాని కొందరు నాయికలు గుర్తించాలి. డ్రెస్సింగ్, మేకప్, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ప్రతి విషయంలో దర్శకులు ఏం చెబితే అదే చేస్తా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఓ హీరోయిన్ నా డ్రెసింగ్, మేకప్ గురించి కామెంట్ చేశారు. ఆమె పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆస్పత్రి సన్నివేశంలో నా మేకప్ విషయంలో ఆమె తప్పుబట్టింది. ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో ఉంటుంది. కమర్షియల్, రియలెస్టిక్ కథలు ఉంటాయి. రియలెస్టిక్ చిత్రంలో నటిేస్త తప్పకుండా లుక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కమర్షియల్ సినిమాలో దర్శకుడు హీరోయిన్స్‌ను స్టైలిష్‌గా చూపించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు’’ అంటూ నయన్ సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నయన్ కౌంటర్ మాళవికకే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అలాగే ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడం గురించి కూడా నయనతార చెప్పుకొచ్చారు. ‘‘నేను 18 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. అందరి బాటలోనే నేనూ వెళ్లేదాన్ని. కొన్నాళ్లకు నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకూ భిన్నమైన పాత్రలకు ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్లా. ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలొస్తున్నాయి. నటిగా నా ప్రయాణం మొదలైనప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలంటే ఏ నిర్మాత ఆసక్తి చూపించేవారు కాదు. కొన్ని చిత్రాల్లో అయిన కథానాయికలకు సరైన పాత్రలు కూడా ఉండేవి కాదు. అవన్నీ చూసి కథానాయికలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుకునేదాన్ని. ఆడియో ఫంక్షన్స్‌లో కూడా హీరోయిన్స్ పక్కన పెట్టేస్తారు. వారి కనీసం ప్రస్తావించరు. అవన్నీ చూసి విసిగిపోయిన సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే నేను ఏ ఫంక్షన్‌లోనూ కనిపించను’’ అని చెప్పారు నయన్. è