Namrata Shirodkar :పెళ్లితో నా ప్రపంచమే మారిపోయింది!
ABN , First Publish Date - 2022-12-18T09:20:28+05:30 IST
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్ మహేశ్‌బాబు నటించిన ‘వంశీ’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సెట్లోనే ప్రిన్స్‌తో ప్రేమలోపడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకుని ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత జంట ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodka, )మహేశ్‌బాబు నటించిన ‘వంశీ’ (Vamsi movie)చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సెట్లోనే ప్రిన్స్‌తో ప్రేమలోపడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకుని ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు(MAheshbabu)-నమ్రత జంట ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాహానంతరం సినిమాలకు బై చెప్పారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు. సినిమాలకు బై చెప్పడం గురించి ఆమె స్పందిస్తూ ‘‘తన జీవిత బాగస్వామి ఎలా ఉండాలో మహేశ్‌కు ఓ ఐడియా ఉంది. పెళ్లికి ముందే మహేశ్ ఓ కండీషన్ పెట్టాడు. దానికి నేను అంగీకరించా. మహేశ్‌తో పెళ్లి జరగడమే నాకు హ్యాపీ హ్యాపీ మూమెంట్. తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచీ నా జీవితం మరింత ఆనందంగా సాగుతుంది. అతనితో పెళ్లి నా ప్రపంచాన్నే మార్చేసింది. సితార అన్ప్లాన్డ్ బేబీ. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని ఇప్పుడు అనిపిస్తుంటుంది. గౌతమ్ పుట్టిన సమయంలో కఠిన పరిస్థితులు చూశాం. తను ఎనిమిది నెలలకే పుట్టాడు. అసలు బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారు’’ అంటూ నమ్రత భావోద్వేగానికి లోనయ్యారు.(persanal life )
స్ట్రాటజీ, ప్లాన్‌గా ఉండటం తనకు చేతకాదని, ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో అలాగే ముందుకెళ్లానని చెప్పారు. ఎదుటి వారికి బాధపెట్టడం, ఇబ్బంది కలిగించడం లాంటివి నాకు రావు. నేను, నా కుటుంబం నా చుట్టూ ఉండేవాళ్లంతా బాగుండాలని కోరుకుంటా. తను నటించిన తొలి చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదని, ఆ చిత్రం రెడీగా ఉందో లేదో కనుక్కోవాలని ఆమె అన్నారు. ‘‘నాకు ఇప్పుడు కెమెరా వెనకుండి పనులు చూసుకోవడమే నచ్చుతుంది. కెమెరా ముందు కనిపించే అంత ఇంట్రెస్ట్, ఓర్పు నాకు లేదు. సెట్లో మహేశ్ షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తా’’ అని నమ్రత చెప్పారు.