MM Keeravani: సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం
ABN , First Publish Date - 2022-12-14T18:33:46+05:30 IST
ఒక గుడ్ న్యూస్ విన్న వెంటనే.. మరో బ్యాడ్ న్యూస్ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani)ని వెంటాడింది. ఆయన తల్లిగారైన భానుమతి
ఒక గుడ్ న్యూస్ విన్న వెంటనే.. మరో బ్యాడ్ న్యూస్ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani)ని వెంటాడింది. ఆయన తల్లిగారైన భానుమతి (Bhanumati)గారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. హైదరాబాద్ కిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషయమించడంతో బుధవారం సాయంత్రం ఆమె మృతి చెందినట్లుగా సమాచారం.
ఆయన సంగీతం అందించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (Golden Globe Awards)లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ ఆనందంలో ఉన్న ఫ్యామిలీలో.. వెంటనే ఇటువంటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరం. భానుమతిగారి భౌతిక కాయాన్ని.. దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఇంటికి తరలించినట్లుగా సమాచారం. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కీరవాణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. భానుమతిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.