Chiranjeevi: ‘చాలా బాధగా ఉంది’.. హీరాబెన్‌ మృతి పట్ల చిరంజీవి సంతాపం

ABN , First Publish Date - 2022-12-30T12:24:15+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తల్లి హీరాబెన్ (Heeraben) మృతి చెందారు. ఇటీవలే వందో పుట్టిన రోజు జరుపుకున్న హీరాబెన్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరారు.

Chiranjeevi: ‘చాలా బాధగా ఉంది’.. హీరాబెన్‌ మృతి పట్ల చిరంజీవి సంతాపం

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తల్లి హీరాబెన్ (Heeraben) మృతి చెందారు. ఇటీవలే వందో పుట్టిన రోజు జరుపుకున్న హీరాబెన్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరారు. ప్రధాని మోదీ అక్కడికి వెళ్లి తల్లిని ప్రరామర్శించారు. కాగా.. నేడు (శుక్రవారం) ఉదయం ఆమె కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

హీరాబెన్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానికి సానుభూతి తెలియజేశారు. స్వర్గానికి వెళ్లిన ఆమె ఆత్మకి నివాళి అర్పించారు. ఆయన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌లో.. ‘మన గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ప్రియమైన తల్లి శ్రీమతి హీరాబా మోదీజీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది. స్వర్గలోకానికి వెళ్లిన ఆవె దివ్య ఆత్మకు నా నివాళులు. నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి!’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2022-12-30T12:25:44+05:30 IST